Home /News /national /

BITCOIN SCAM IRKS KARNATAKA GOVERNMENT WORD WAR BETWEEN BJP AND CONGRESS AK GH

Bitcoin Scam: కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేసిన బిట్‌కాయిన్‌ స్కామ్‌.. విమర్శలు చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bitcoin Scam: పోలీసుల విచారణలో తన వ్యాపారాన్ని శ్రీకృష్ణ వెల్లడించినట్టు తెలుస్తోంది. రెండు క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లను హ్యాక్‌ చేసి, వాటి నుంచి 2వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 5000 బిట్‌ కాయిన్స్‌ శ్రీకృష్ణ దొంగలించినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
(D.P. Satish, News18)

కర్ణాటకలో వెలుగుచూసిన బిట్‌కాయిన్‌ తుఫాన్‌ అనేక రాజకీయ దిగ్గజాలను వణికిస్తోంది. అంతర్జాతీయ హ్యాకర్ అని అనుమానిస్తున్న ఒక వ్యక్తిని కర్ణాటక (Karnataka) పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా అతను అనేక మంది పెద్ద రాజకీయ నాయకులకు ఖాతాల్లోకి రూ.వేల కోట్ల విలువ చేసే బిట్‌కాయిన్లు బదిలీ చేసినట్టు తెలిపినట్టు సమాచారం. 2018లో బెంగళూరులోని (Bengaluru) ఒక పబ్‌లో ఒక యువకుడి హత్య కేసుకు సంబంధించిన 20ల్లో ఉన్న యువకుడు శ్రీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్లే ఎన్‌.ఎ.హ్యారిస్‌ కుమారుడు మహమ్మద్‌ నలపాద్‌ ప్రధాన నిందితుడు. రెండేళ్లుగా శ్రీకృష్ణ పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు.

పోలీసుల విచారణలో తన వ్యాపారాన్ని శ్రీకృష్ణ వెల్లడించినట్టు తెలుస్తోంది. రెండు క్రిప్టో కరెన్సీ (Crypto Currency) ఎక్స్ఛేంజ్‌లను హ్యాక్‌ చేసి, వాటి నుంచి 2వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 5000 బిట్‌ కాయిన్స్‌ శ్రీకృష్ణ దొంగలించినట్టు సమాచారం. అంతే కాదు ప్రభుత్వానికి చెందిన అనేక వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి వందల కోట్ల రూపాయల టెండర్లను మార్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ సైబర్‌ నేరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కూడా అతన్ని ప్రశ్నిస్తోంది.

ఈ బిట్‌కాయిన్స్‌ను అతను బలవంతంగా కొంత అధికార బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టుగా సమాచారం అందుతోంది. కొంత మంది పోలీసు అధికారులకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ బిట్‌కాయిన్‌ బదిలీ బాగోతంపై సమాధానం చెప్పాలని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైని విపక్షనేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని కొంత మంది పెద్దవాళ్లు బిట్‌కాయిన్స్‌ కలిగి ఉన్నట్టు నాకు తెలిసింది. వారికి అవి ఎలా వచ్చాయి? ఈ భారీ కుంభకోణం గురించి బీజేపీ వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు. ఈ విషయమై బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిని విపక్ష కాంగ్రెస్‌ చేపట్టింది.

మరో వైపు ఈ కుంభకోణంతో కదిలిపోయిన బీజేపీ ప్రభుత్వం, ఇవన్నీ నిరాధార ఆరోపణలని, బీజేపీ నేతలెవరికీ ఇందులో ప్రమేయం లేదని చెబుతోంది. ‘ఈ ఆరోపణలన్నీ దురుద్దేశంతో చేస్తున్నవే. ఈ మొత్తం హ్యాకింగ్‌ స్కామ్‌ను రాష్ట్ర పోలీసులు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా దర్యాప్తు చేస్తున్నాయి’ అని కర్ణాటక ఐటీ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ అన్నారు.

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా ఇదే మాట చెబుతున్నారు. అమెరికన్‌ కంపెనీల్లో సైబర్‌ మోసాలకు సంబంధించి శ్రీకృష్ణను విచారించేందుకు అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ అధికారులు వచ్చారన్న వస్తున్న వార్తలను కర్ణాటక హోమ్‌ మంత్రి జ్ఞానేంద్ర ఖండించారు. అయితే పెద్ద నేతలను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మరో వైపు శ్రీకృష్ణ తాను చెబుతున్న మాటలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని కర్ణాటక పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?

2018లో బెంగళూరు నగరంలోని ఒక పబ్‌లో విద్వత్‌ అనే యువకుడిపై నలపాద్‌ దాడి చేశారు. ఆ నేరానికి అతను రెండు నెలలు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ ఘటన సమయంలో నలపాద్‌ వెంట శ్రీకృష్ణ ఉన్నట్టు సమాచారం.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bitcoin, Karnataka

తదుపరి వార్తలు