ఉప ఎన్నికలకు కమల్ హాసన్ సై...20 స్థానాల్లో పోటీకి సిద్ధం

తమిళనాడులో 20 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో MNM పోటీచేస్తుందని కమల్ ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి తాము రెడీ అని స్పష్టంచేశారు

news18-telugu
Updated: November 7, 2018, 6:52 PM IST
ఉప ఎన్నికలకు కమల్ హాసన్ సై...20 స్థానాల్లో పోటీకి సిద్ధం
కమల్ హాసన్ (ఫైల్ ఫొటో)
  • Share this:
64వ పుట్టిన రోజు నాడు లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రాజకీయ అరంగ్రేటం చేసిన కమల్.. ఇక ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధయ్యారు.. తమిళనాడులో 20 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో MNM పోటీచేస్తుందని కమల్ ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి తాము రెడీ అని స్పష్టంచేశారు.

ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియిదు. ఎన్నికల్లో పోటీచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడొచ్చినా మేం రెడీ.
కమల్ హాసన్, MNM అధినేత
తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల(దినకరన్ వర్గం)పై అనర్హత వేటుపడింది. ఆ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సైతం సమర్థించింది. ఆ 18 స్థానాల్లో ఉప ఎన్నికల జరగాల్సి ఉంది. అటు కరుణానిధి, ఏకే బోస్ మృతితో తిరువారూర్, తిరుపరన్‌కుంద్రమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానాలు సైతం ఖాళీగా ఉన్నాయి. దాంతో తమిళనాట మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమికి 97 మంది ఎమ్మెల్యేలు (DMK 88, కాంగ్రెస్ 8, IUML 1) ఉన్నారు. అధికారిక అన్నాడీఎంకేకు 116 (స్పీకర్ ధన్‌పాల్‌తో కలిపి) మంది సభ్యుల బలముంది.


Published by: Shiva Kumar Addula
First published: November 7, 2018, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading