HOME »NEWS »NATIONAL »bird flu 2021 now h5n8 avian influenza enters 10 states in india here is the full details nk

Bird flu 2021: 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. బాబోయ్.. విస్తరిస్తోందిగా.. ఇలాగైతే ఎలా?

Bird flu 2021: 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. బాబోయ్.. విస్తరిస్తోందిగా.. ఇలాగైతే ఎలా?
10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. బాబోయ్.. విస్తరిస్తోందిగా.. ఇలాగైతే ఎలా? (File Image)

Bird flu 2021: ఓవైపు పాత కరోనా, కొత్త కరోనా, స్ట్రెయిన్లూ అవీ ఇవీ ఉండగా... అవి చాలవన్నట్లు... ఈ బర్డ్ ఫ్లూ ప్రపంచానికీ, ఇండియాకూ తలనొప్పిగా మారుతోంది.

 • Share this:
  Bird flu 2021: నెల రోజుల కిందట ఇండియాలో బర్డ్ ఫ్లూ అన్నదే లేదు. మరి ఇప్పుడో ఏకంగా 10 రాష్ట్రాల్లో తిష్టవేసింది. రోజుకో రాష్ట్రాన్ని తన జాబితాలో వేసేసుకుంటోంది. ఓవైపు కరోనా ఇంకా వదల్లేదు. ఈమధ్యే కొత్త కరోనా కూడా ఇండియాలోకి వచ్చిందన్నారు. మన అదృష్టం కొద్దీ అది పెద్దగా ప్రభావం చూపట్లేదు. పోనీలే అనుకుంటుంటే... ఇదిగో ఈ తలనొప్పి మొదలైంది. దేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లో ఇది వ్యాపించిందని అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం... ఇది కరోనా కంటే వేగంగా వ్యాపించగల వైరస్. ఇది ప్రాణుల నుంచి మనుషులకు సోకుతుందని ఇంకా నిర్ధారణ కాలేదు. అందువల్ల ఒకింత మనం ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగని... చచ్చిపోతున్న పక్షుల దగ్గరకు పీపీఈ కిట్లు లేకుండా వెళ్లవద్దని అధికారులు అంటున్నారు.

  ఇప్పటికే 7 రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ గుప్పిట్లో చిక్కుకోగా... తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లకూ వ్యాపించింది. మహారాష్ట్రలో 10వేల పక్షుల్ని చంపేయాలని డిసైడయ్యారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 165, రుషికేష్ దగ్గర్లో 30 పక్షులు చనిపోయారు. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా... ఎల్లారెడ్డి పేట మండలం... వెంకటాపురంలో... వారం నుంచి 380 కోళ్లు చనిపోయాయి. సోమవారం మరో 15 ప్రాణాలు విడిచాయి. ఐతే... తెలంగాణ, ఏపీలో బర్డ్ ‌ఫ్లూ లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కంటే... ఏపీకి బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే... కొల్లేరి సహా కొన్ని జలాశయాలకు విదేశాల నుంచి పక్షులు వస్తుంటాయి. వాటిలో వైరస్ ఉంటే... వాటి ద్వారా స్థానిక పక్షులకు అది వ్యాపిస్తుంది. అలా ఏపీలోకి అది ప్రవేశించే ప్రమాదం కనిపిస్తోంది.  చికెన్‌కి దూరం:
  బర్డ్‌ఫ్లూతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మాంస ప్రియులు చికెన్ జోలికి వెళ్లట్లేదు. చికెన్ అమ్మకాలు 60 శాతం పడిపోయాయి. ధర 40 శాతం తగ్గింది. బాగా మంచిగా వండుకొని తింటే ఏ సమస్యా ఉండదు అని అధికారులు, డాక్టర్లూ చెబుతున్నా... ప్రజలు రిస్క్ చేయట్లేదు. ఏం పోయింది... కొన్ని రోజులు తినడం మానేస్తాం అంటూ చికెన్ వద్దంటున్నారు. దాంతో మాంసం షాపుల వారికి బిజినెస్ దెబ్బతింటోంది. కోడిగుడ్ల అమ్మకాలు కూడా తగ్గాయి.

  అదో రకం వైరస్:
  గతేడాది చివర్లో యూరోపియన్ దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించింది. మిగతా దేశాల్లో కంటే ఫ్రాన్స్‌లో ఇది ఎక్కువగా ఉంది. ఇది చాలా వేగంగా, ఈజీగా వ్యాపించే లక్షణం ఉన్న వైరస్ కావడం వల్ల ఎంత ప్రయత్నించినా దీన్ని ఆపలేకపోతున్నారు. కరోనాలో రూపాంతర వైరస్ (Mutated Virus) రాలా... అదే విధంగా... బర్డ్ ఫ్లూ‌ వైరస్‌లలో కూడా చాలా రూపాంతరాలు వచ్చాయి. తాజాగా వచ్చినది H5N8 అట. ఇది ఇదివరకు వచ్చిన వాటి కంటే కాస్త జోరు ఎక్కువగా ఉందని అంటున్నారు.

  ఇది కూడా చదివేయండి:Elaichi Health Benefits: యాలకులతో ఆస్తమాకు చెక్... ఇలా చెయ్యండి

  ఇండియాలోకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి... దీన్నుంచి తప్పించుకోగలం అనే గ్యారెంటీ ఏ రాష్ట్రానికీ లేదు. ఎందుకంటే... బయట తిరిగే పక్షులు... ఈజీగా ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చేస్తాయి. వాటి ద్వారా వైరస్ ఈజీగా పాకేస్తోంది. కాబట్టి... వైరస్ వస్తే... తగిన జాగ్రత్తలు తీసుకనేలా ప్రిపేర్ అవ్వడమే చేయగలిగింది అంటూ... అధికారులు... అలా రెడీ అవుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:January 12, 2021, 07:47 IST