Home /News /national /

Army Chief General Bipin Rawat: బిపిన్ రావ‌త్‌ దేశ గౌర‌వాన్ని పెంచారు.. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం గర్వంగా ఉంది: లెఫ్టినెంట్ జనరల్ ప్రసాద్

Army Chief General Bipin Rawat: బిపిన్ రావ‌త్‌ దేశ గౌర‌వాన్ని పెంచారు.. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం గర్వంగా ఉంది: లెఫ్టినెంట్ జనరల్ ప్రసాద్

కొడగు పర్యటన సందర్భంగా జనరల్ రావత్‌తో రచయిత లెఫ్టినెంట్ జనరల్ BNBM ప్రసాద్ (ఫైల్‌)

కొడగు పర్యటన సందర్భంగా జనరల్ రావత్‌తో రచయిత లెఫ్టినెంట్ జనరల్ BNBM ప్రసాద్ (ఫైల్‌)

Army Chief General Bipin Rawat: భారత తొలి, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబ‌ర్ 8, 2021న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందారు. ఆయ‌న మృతిపై ప్ర‌ముఖ‌లు సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాజీ డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ & చీఫ్ కన్సల్టెంట్ మెడిసిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ & రాష్ట్రపతి గౌరవ సర్జన్ బీఎన్‌బీఎం ప్ర‌సాద్ బిపిన్ రావ‌త్‌తో ఆయ‌న అనుబంధాన్ని పంచుకొన్నారు.

ఇంకా చదవండి ...
    భారత తొలి, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబ‌ర్ 8, 2021న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం (Helicopter Crash) లో మృతిచెందారు. ఈ ఘోర ప్ర‌మాదంలో ఆయ‌న స‌తీమ‌ణి ప‌లువురు అధికారులు మృతి చెందారు. వీరి మృతిపై ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకొని ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. బిపిన్ రావ‌త్ మృతిపై మాజీ డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ & చీఫ్ కన్సల్టెంట్ మెడిసిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ & రాష్ట్రపతి (President) గౌరవ సర్జన్ బీఎన్‌బీఎం ప్ర‌సాద్ బిపిన్ రావ‌త్‌తో ఆయ‌న అనుబంధాన్ని పంచుకొన్నారు. ఈ సంర్భంగా ఆయ‌న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ గురించి చెప్పిన విష‌యాలు..

    " ప్ర‌తీ సైనికుడు మాతృదేశం కోసం ప్రాణార్ప‌ణ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాడు. అందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ (Bipin Rawat) మిన‌హాయింపు కాదు. సైనికుడికి యూనిఫాంలో ప్రాణాలు కోల్పోవ‌డం కంటే పెద్ద గౌర‌వం ఇంకోటి ఉండ‌దు. ఈ రోజు దేశం దుర‌దృష్ట‌క‌మైన సంఘ‌ట‌న‌ను చూసింది. గొప్ప దేశ‌భ‌క్తుడు.. నిరంత‌రం దేశం కోసం ఆలోచించే వ్య‌క్తి బిపిన్ రావ‌త్ మృతి దేశానికి తీర‌ని లోటు. సైన్యంలో న‌ల‌భై ఏళ్ల ఆయ‌న ప్ర‌యాణం ఎంతో ఉన్న‌త‌మైంది. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎదిగిన ఆయ‌న ప్ర‌యాణం ఎంతో ఉన్న‌త‌మైంది.

    ఇది యాదృచికం కాదు.. గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన ఈ ఫోర్‌స్టార్ జ‌న‌ర‌ల్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) వెళ్లే మార్గంలో మృతి చెంద‌డం. ఒక‌ప్పుడు అదే గూర్ఖా రెజిమెంట్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన ఫీల్డ్ మార్షల్ మానెక్సావ్ కూడా వెల్లింగ్‌ట‌న్ మిల‌ట‌రీ హాస్పెట‌ల్‌లోనే మృతి చెంద‌డం. ఈ ఇద్ద‌రూ ఒకే చోట మృతి చెందారు. ఇద్ద‌రు ఈ దేశానికి హీరోలే. మానెక్సావ్ ఈ దేశానికి మొద‌టి ఫీల్డ్ మార్ష‌ల్. అలాగే రావ‌త్‌కూడా ఈ దేశానికి మొద‌టి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. నాకు ఎంతో గ‌ర్వంగా ఉంది ఈ ఇద్ద‌రితో సంబంధం ఉండ‌డం. నేను ఫీల్డ్ మార్షల్ మానెక్సావ్‌కు చివ‌రి ద‌శ‌లో ట్రీట్‌మెంట్ కూడా చేశాను.

    1971 యుద్ధంలో వ్యూహ ర‌చ‌న చేసిన గొప్ప వ్య‌క్తి ఫీల్డ్ మార్షల్ మానెక్సావ్.. అలాగే స‌ర్జిక‌ల్ స్ట్రైక్ వెనుక ఉన్నది బిపిన్ రావ‌త్‌. ఇద్ద‌రు దేశ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి చాట‌డంలో ఎంతో కృషి చేశారు. వారి జీవితం దేశానికే అంకితం చేశారు. వీరిద్ద‌రూ సైనిక బ‌లాన్ని నిరంతంరం మెరుగులు దిద్ద‌డానికి కృషి చేశారు.

    Army Chief General Bipin Rawat: జీవితాంతం దేశ‌సేవ‌లోనే.. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్‌ ప్ర‌స్థానం


    బిపిన్ రావ‌త్ ప్ర‌తీ కొత్త విష‌యాన్ని సైనికుల‌కు అందేలా చూశారు. వార్ టెక్నిక్‌ల నుంచి సైబ‌ర్ అటాక్‌ల వ‌ర‌కు అన్ని విష‌యాల్లో సైన్యాన్ని ప‌రిపుష్టం చేయ‌డానికి కృషి చేశారు.

    ఈ ఇద్దరు లెజెండ్స్‌తో అనుబంధం కలిగి ఉండటం నా అదృష్టం. నేను ఫీల్డ్‌కి చాలా దగ్గరగా ఉన్నాను. జూన్ 27 2008న ఫీల్డ్ మార్ష‌ల్ ఈ లోకాన్ని వీడుతున్న‌ప్పుడు నేను అత‌ని చేతిని ప‌ట్టుకొనే ఉన్నాను. కోల్‌కతాలో జనరల్ రావత్ నా సహోద్యోగి రావ‌త్ ఈస్టర్న్ థియేటర్ ఆఫ్ వార్‌లో సైనిక చర్యను ఊహించిన మేజర్ జనరల్. బర్మా అరణ్యాలలో దాక్కున్న తిరుగుబాటుదారులపై సర్జికల్ స్ట్రైక్  చేయ‌డంలో రావ‌త్ పాత్ర ఎంతో ఉంది.

    నేను 2012 నుంచి 2014 మధ్య కాలంలో ఈస్టర్న్ కమాండ్ హాస్పిటల్‌ను క‌మాండ్ చేశాను. ఈ ఆస్ప‌త్రి దివంగత ఫీల్డ్ మార్షల్ మాన‌స పుత్రిక. ఈ ఆస్ప‌త్రిలో నేను ఇద్ద‌రికి చికిత్స చేశాను. వారే జనరల్ రావత్, అతని తండ్రి దివంగత లెఫ్టినెంట్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రావత్ వీరిద్ద‌రూ ఈ దేశానికి ఎంతో సేవ చేశారు.

    Helicopter Crash: మృత్యువుతో పోరాడుతున్న ఒక్క‌డు.. ప్ర‌మాదంలో బ‌య‌ట‌ప‌డ్డ క‌మాండ‌ర్‌


    బిపిన్ రావ‌త్ స‌తీమ‌ణి మ‌ధులిక నాకు బాగా తెలుసు. ఆమెకు ఒక డాక్ట‌ర్‌గా, స్నేహితుడిగా ఉన్నాను. జనరల్ రావత్ ఆర్మీ స్టాఫ్ (VCOAS) వైస్ చీఫ్‌గా ఉన్నప్పుడు, నేను నా 21 సఫ్దర్‌జంగ్ రోడ్డు నివాసంలో అతని ప‌క్కింటి వాడిన మాత్ర‌మే కాదు. ఆయ‌కు స్నేహితుడిగా ఉండే అవ‌కాశం క‌లిగింది. సాధారణ కోర్సులో అతను ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయ్యి ఉండేవాడు కాదు కానీ విధి అత‌న్ని ఆ శిఖ‌రాల‌ను అధిరోహించేలా చేసింది. అందుకు అత‌ని అంకితభావం కూడా ఒక కార‌ణం.

    జీవితాంతం దేశ‌సేవ‌కే ఆయ‌న‌ను అంకితం చేసుకొన్నాడు. విధి ఎంతో విచిత్ర‌మైంది. అత‌డిని, ఆయ‌న భార్య‌ను ఒకేసారి తీసుకెళ్లింది. ఆయ‌న అవ‌స‌రం దేశానికి ఇంకా ఉంది. ఈ ఘోర ప్ర‌మాదంలో వారిద్ద‌రితోపాటు మ‌రో 11 మంది సాయుధ ద‌ళాల సిబ్బంది లోకాన్ని వీడ‌డం చాలా బాధాక‌రం. ఆ భ‌గ‌వంతుడు భార్య భ‌ర్త‌ల ఇద్ద‌రి ఆత్మ‌ల‌కు శాంతినివ్వాల‌ని కోరుకుంటున్నాను. "
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Army Chief General Bipin Rawa, Bipin Rawat, Helicopter Crash, Indian Air Force, Indian Army

    తదుపరి వార్తలు