పాకిస్తాన్‌కు మోదీ షాక్... ప్రమాణస్వీకారానికి 'బిమ్‌స్టెక్' నేతలకు మాత్రమే ఆహ్వానం

PM Modi’s Swearing-in Ceremony | ఈసారి మోదీ ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్‌కు ఆహ్వానం అందుతుందా? లేదా? అన్న ఆసక్తి అందరిలో కనిపించింది.

news18-telugu
Updated: May 28, 2019, 1:08 PM IST
పాకిస్తాన్‌కు మోదీ షాక్... ప్రమాణస్వీకారానికి 'బిమ్‌స్టెక్' నేతలకు మాత్రమే ఆహ్వానం
పాకిస్తాన్‌కు మోదీ షాక్... ప్రమాణస్వీకారానికి 'బిమ్‌స్టెక్' నేతలకు మాత్రమే ఆహ్వానం (Image: PTI)
  • Share this:
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మే 30న మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2014లో మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించింది భారతదేశం. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లడం, నవాజ్ షరీఫ్ ఇంట్లో వేడుకకు హాజరవడం లాంటి పరిణామాలతో రెండు దేశాల మధ్య స్నేహం చిగురిస్తుందని అనుకున్నారంతా. కానీ 2016లో పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడులు, లైన్ ఆఫ్ కంట్రోల్‌లో భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్, 2019లో పుల్వామాలో భారత సైన్యంపై మరోసారి ఉగ్రవాద దాడులు, ఆ తర్వాత పాకిస్తాన్‌లో బాలాకోట్‌లో భారతదేశం ఎయిర్‌స్ట్రైక్స్ లాంటి పరిణామాలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి మోదీ ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్‌కు ఆహ్వానం అందుతుందా? లేదా? అన్న ఆసక్తి అందరిలో కనిపించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాధినేతలకు మాత్రమే భారతదేశం ఆహ్వానం పంపింది. BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటీవ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కార్పొరేషన్. బంగాళాఖాతం తీరంగా ఉన్న దేశాలు మాత్రమే బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. భారతదేశం బిమ్‌స్టెక్ దేశాలకే మోదీ ప్రమాణ స్వీకార వేడుక ఆహ్వానం పంపడంతో ఈసారి పాకిస్తాన్‌కు ఇన్విటేషన్ అందనట్టే. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించకూడదన్న ఆలోచనతోనే భారతదేశం బిమ్‌స్టెక్ గ్రూప్‌ను ఎంచుకుందన్న వాదన వినిపిస్తోంది. మారిషస్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇన్విటేషన్ పంపలేదు భారతదేశం. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. పాకిస్తాన్ దేశాధినేతకు ఆహ్వానం పంపకుండా భారత ప్రధాన మంత్రి "అంతర్గత రాజకీయాలు" అడ్డుపడ్డాయని పాక్ ప్రభుత్వం స్పందించింది.

మే 30 రాత్రి 7 గంటలకు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 సీట్లు రాగా, బీజేపీ 303 స్థానాలను దక్కించుకుంది.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివేLock Aadhaar: ఎస్ఎంఎస్‌తో ఆధార్ లాక్ చేయొచ్చు ఇలా

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading