హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Parliament : ఓటర్ ఐడీకి ఆధార్ లింక్.. బిల్లుకు లోక్ సభ ఆమోదం.. సంచలన వ్యాఖ్యలు

Parliament : ఓటర్ ఐడీకి ఆధార్ లింక్.. బిల్లుకు లోక్ సభ ఆమోదం.. సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

ఓటరు ఐడీ కార్డులకు ఆధార్ ను అనుసందానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ సోమవారం లోక్ సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. దీనిపై విపక్ష ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు.

ఇంకా చదవండి ...

ఎన్నికల సంస్కరణలో భాగంగా ఓటరు ఐడీ కార్డులకు ఆధార్ ను అనుసందానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ సోమవారం లోక్ సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటన చేశారు. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానంతోపాటు ఇకపై ప్రతి ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదు, మహిళా సర్వీస్ అధికారిణిల భర్తలకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం, ఎన్నికల కమిషన్ పరిధిని విస్తృతం చేసే కీలక అంశాలు ఉన్నాయీ బిల్లులో. కాగా, మిగతా మూడు అంశాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకున్నా, ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి.

గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు సోమవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలకు దిగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరికి మధ్యాహ్నం తర్వాత గందరగోళం మధ్యనే బిల్లు పాస్ అయినట్లు ప్రకటన వెలువడింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేతలు సంచలన వ్యాఖ్యానాలు చేశారు.

Pushpa.. ఇంత దారుణమా? -భార్యాభర్తలు చెరోవైపు చేరి బాలికను నగ్నంగా పడుకోబెట్టి.. ఏళ్లపాటు..బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ఆధార్ అంటే నివాస రుజువు మాత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని, అలాంటిదాన్ని ఓటరు జాబితాకు అనుసంధానం చేయడం తగదన్నారు. ఈ చట్టం వల్ల భారత పౌరులు కానివారు కూడా ఓట్లేసే వీలు ఏర్పడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేయడానికి ఆధార్ చట్టం అనుమతించదని, చట్ట విరుద్ధమైన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని మరో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి డిమాండ్ చేశారు. ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్‌ చేశారు.

Philippines : శవాల దిబ్బల్లా ఊళ్లు.. 208మందిని బలి తీసుకున్న Super Typhoon Rai


ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే హక్కును ఈ (ఎన్నికల చట్టాల సవరణ) బిల్లు అణచివేస్తుందని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఆక్షేపించారు. దేశంలో ఆధార్ కార్డు లేని ఎస్సీ, ఎస్టీలు ఎందరో ఉన్నారని, వాళ్లందరికీ ఇప్పుడు ఓటు హక్కు దూరమయ్యే పరిస్థితి నెలకొందని బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే ఆరోపించారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కు అని, ఎన్నికల ప్రక్రియతో ఆధార్‌ను అనుసంధానం చేయడం పౌరుల హక్కులకు భంగం కలిగిస్తుందని ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్ వ్యాఖ్యానించారు.

Parliament : ఓటరు ఐడీకి ఆధార్ లింకు చట్ట విరుద్ధం.. బిల్లుపై విపక్షాలు.. మంత్రి మిశ్రా రాజీనామాకు పట్టుకాగా, ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021పై కేంద్రం వాదన మాత్రం వేరుగా ఉంది. ఈ సంస్కరణల ద్వారా బోగస్‌ ఓట్లను తొలగించే వీలుంటుందని, ఓటర్ల జాబితా మరింత బలోపేత అవుతుందని, తద్వారా ఓటింగ్‌ ప్రక్రియ మెరుగుపడుతుందని కేంద్రం చెబుతోంది. ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతరత్రా భవంతులను ఈసీ వాడుకోడానికి అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నాయని, వాటికి పరిష్కారంగా ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించే అంశాన్ని కూడా బిల్లులో పొందిపర్చినట్లు కేంద్రం చెబుతోంది.

First published:

Tags: AADHAR, Election Commission of India, Parliament Winter session

ఉత్తమ కథలు