హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం.. ఆశీర్వాదం తీసుకున్న తేజస్వి

Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం.. ఆశీర్వాదం తీసుకున్న తేజస్వి

నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం

నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం

Nitish Kumar swears in as CM: బీహార్ సీఎంగా 8వ సారి ప్రమాణస్వీకారం చేశారు నితీష్ కుమార్. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీహార్ (Bihar) సీఎంగా జేడీయూ నేత నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రమాణస్వీకారం చేశారు.  మంగళవారం బీజేపీకి గుడ్ బై చెప్పి.. ఎన్డీయే కూటమి నుంచి బయటకువచ్చిన ఆయన.. ఆ మరుసటి రోజే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల సహకారంతో మరోసారి బీహార్ సీఎం అయ్యారు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్ యాదవ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నితీష్ కుమార్ పాదాలకు నమస్కరించి..ఆశీర్వాదం తీసుకున్నారు తేజస్వి యాదవ్.

తేజస్వి యాదవ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం సంతోషంగా ఉందని లాలూ ఫ్యామిలీ హర్షం వ్యక్త చేసింది. తమకు అండగా ఉన్న బీహార్ ప్రజలందరికీ ధన్యవాదాలని తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ అన్నారు. బీహార్ ప్రజలకు ఇక నుంచి మంచి జరుగుతుందని.. చాలా సంతోషంగా ఉందని మాజీ సీఎం రబ్రీ దేవి తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పారు.

మరోవైపు నితీష్ కుమార్ భవితవ్యం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాన మంత్రిగా ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఎన్డీయేకి గుడ్ బై చెప్పారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై నితీష్ కుమార్ స్పందించారు. తాను ప్రధాని అభ్యర్థుల జాబితాలో తాను లేనని స్పష్టం చేశారు.

అటు నితీష్ తీరుపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి మోసాలు చేయడం ఆయనకు కొత్తమీ కాదని కాషాయ నేతలు మండిపడుతున్నారు. బీహార్‌లో కీలు బొమ్మ ప్రభుత్వం ఏర్పాటయిందని.. నితీష్ కుమార్ పేరు మాత్రమే సీఎంగా ఉంటారని.. తెరవెనక అంతా తేజస్వి యాదవే నడిపిస్తారని విరుచుకుపడుతున్నారు.

First published:

Tags: Bihar, Nitish Kumar, Tejashwi Yadav

ఉత్తమ కథలు