BIHAR TO ALLOW EXPLORATION OF INDIA LARGEST GOLD RESERVE PVN
Gold Mining : కేజీఎఫ్ తరహాల్ గోల్డ్ మైనింగ్ కు బీహార్ ఫ్లాన్..వర్కౌట్ అయితే కనకవర్షమే
ప్రతీకాత్మక చిత్రం
Bihar To Allow Exploration Of Gold Reserve : బీహార్(Bihar) లో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. బిహార్ లోని జముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొంది.
Bihar To Allow Exploration Of Gold Reserve : బీహార్(Bihar) లో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. బిహార్ లోని జముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొంది. బీహార్లోని జముయి(Jamui) జిల్లాలో దేశంలోనే అతిపెద్ద బంగారం గనులు(Gold Mines) ఉన్నట్లు భారత జియోలాజికల్ సర్వే తెల్చిన క్రమంలో దానిపై దృష్టి సారించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బంగారం వెలికితీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది నితీష్ ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిందని, మైనింగ్ చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బంగారం నిల్వలను వెలికి తీసేందుకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ, జీఎస్ఐతో పాటు మైనింగ్ సంస్థలతో బీహార్ మైన్స్, జియోలజీ విభాగం చర్చలు జరుపుతోంది. జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో గ్రామాల్లో బంగారం నిల్వలు ఉన్నాయన్న జీఎస్ఐ సర్వేపై సమాలోచనలు చేసిన తర్వాతే చర్చల ప్రక్రియ మొదలైంది.
నెల రోజుల్లో జీ3 స్టేజ్ మైనింగ్ కోసం కేంద్ర ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని.. కొన్ని ప్రాంతాల్లో జీ2 సాధారణ అనుమతులు సైతం ఇవ్వనుందని అదనపు చీఫ్ సెక్రెటరీ, మైన్స్ కమిషనర్ హర్జోత్ కౌర్ బమ్రా తెలిపారు. జముయి గోల్డ్ మైన్స్ లో తవ్వకాలు జరిపేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో జీఎస్ఐ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) కూడా ఉన్నాయి. జముయి జిల్లాలోని గనుల్లో ఉన్న బంగారం నిల్వలు (222.885 మిలియన్ టన్నులు) .. మొత్తం దేశంలోని పసిడి నిల్వల్లో 44 శాతానికి సమానం. ఈవిషయాన్ని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల లోక్ సభకు తెలిపారు. నేషనల్ మినరల్ ఇన్వెంటరీ ప్రకారం 2015 మార్చి నాటికి దేశంలోని 501.83 మిలియన్ టన్నుల ముడి బంగారు నిల్వలు ఉండగా.. అందులో ఒక్క బీహార్లోనే 222.885 మిలియన్ టన్నులు ఉందని జోషి తెలియజేశారు.
ఇక,మన దేశంలో బంగారానికి ఉన్నంత డిమాండ్ మరే ఇతర లోహానికి లేదు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళలు నిత్యం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు ఫిజికల్ రూపంలో మన దేశంలో అత్యధికంగా బంగారం వినియోగిస్తారు. బంగారం ధర ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతుంది. కాస్త హెచ్చుతగ్గులతో సుమారు ఒకే రకంగా ఉన్నప్పటికీ, భారతదేశంలోని కొన్ని నగరాల్లో చౌకగా బంగారం లభిస్తుంది. ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కాస్త తక్కువ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. బంగారం ధర ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతుంది. కాస్త హెచ్చుతగ్గులతో సుమారు ఒకే రకంగా ఉన్నప్పటికీ, భారతదేశంలోని కొన్ని నగరాల్లో చౌకగా బంగారం లభిస్తుంది. ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో కాస్త తక్కువ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.