• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR POLICE OFFICER LETTER ON MIGRANT WORKER BECOME CONTROVERSIAL AK

వలస కార్మికులతో క్రైమ్ పెరిగే ఛాన్స్... పోలీస్ అధికారి వివాదాస్పద లేఖ

వలస కార్మికులతో క్రైమ్ పెరిగే ఛాన్స్... పోలీస్ అధికారి వివాదాస్పద లేఖ

ప్రతీకాత్మక చిత్రం

ఉపాధి లేక స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కూలీలు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని బీహార్ పోలీస్ అధికారి లేఖలో ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది.

  • Share this:
    కరోనా కారణంగా పట్టణాల్లో ఉపాధి లేక మళ్లీ సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీల బాధలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే బీహార్‌లోని ఓ పోలీస్ అధికారి మాత్రం వలస కూలీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలకు రాసిన లేఖ బీహార్‌లో వివాదాస్పదంగా మారింది. ఆ రాష్ట్ర రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అమిత్‌ కుమార్‌ జిల్లా ఎస్పీలకు మూడు రోజుల క్రితం ఓ లేఖ రాశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలోనే ఉపాధి లేక స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కూలీలు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కూలీల రాకతో రాష్ట్రంలో మరోసారి క్రైమ్‌ రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఏడీజీ వివాదాస్పద రీతిలో లేఖ రాశారు.

    అంతేకాదు... అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్న కూలీల వివరాలను నమోదు చేసుకోవాలని లేఖలో సూచించారు. కూలీలపై పిడుగులా పడిన కరోనా వైరస్‌ వారిని నేరాలకు పాల్పడేలా చేసే అవకాశం ఉందని... ఉపాధి లేక కుటుంబ గడవక దోపిడీలు, దొంగతనాలకు పాల్పడొచ్చని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ లేఖ బయటకు పొక్కడంతో దీనిపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికులను దొంగలతో పోల్చడం సరైనది కాదని, దీనికి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే తన తన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏడీజీ కుమార్‌ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు