OMG: విషసర్పం కరిస్తే ఎవరూ బ్రతకరు. నురగలు కక్కుకొని స్పాట్లో ప్రాణాలు విడుస్తారు. కాని బీహార్‌లో నాలుగేళ్ల కుర్రాడ్ని కరిచినప్పటికి ప్రాణాలతో ఉన్నాడు. పిల్లాడ్ని కాటేసిందనే కోపంతో స్థానికులే పాముని కర్రలతో కొట్టి చంపారు.
భగవంతుడి ఆశీస్సులు ఉన్నవాళ్లను ఎవరూ ఏమి చేయలేరనే మాట నిజమని రుజువైంది. బీహార్(Bihar)లో జరిగిన ఓ అరుదైన సంఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఎక్కడైనా పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. కాని బీహార్‌లో నాగుపాము (Poisonous snake)ఓ చిన్నపిల్లవాడ్ని కరిచిన 30సెకన్లలో చనిపోయింది. ఇప్పుడు ఈ వార్తే విపరీతంగా వైరల్(Viral) అవుతోంది. అందుకే అంటారు పెద్దలు విషానికి విరుగుడు ఉన్నట్లే విషసర్పానికి చావు తప్పక ఉంటుంది. గోపాల్‌గంజ్(Gopalganj)లో జరిగిన ఈఘటన అందర్ని షాక్‌కి గురి చేసింది.
పవర్ఫుల్ కిడ్..
బరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధోపూర్ గ్రామానికి చెందిన రోహిత్ కుమార్ తన నాలుగేళ్ల కుమారుడు అనూజ్ కుమార్‌ను తీసుకొని కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ససముసా ఖజురి తోలాలోని తన మామ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం అనూజ్ కుమార్ ఇంటి ముందు తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న పొలాల్లోంచి వచ్చిన ఓ నాగుపాము అనూజ్‌కుమార్ కాలుపై కాటేసింది. పాము రావడం పిల్లవాడ్ని కాటేయడం చూసిన మిగిలిన పిల్లల్ని అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడున్న మరికొందరు వ్యక్తులు పిల్లవాడ్ని కరిచిన పాము అటుగా వెళ్లడం గమనించారు. వెంటనే కర్రలు తీసుకొని విషసర్పాన్ని కొట్టి చంపారు. చిన్నారిని రక్షించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పిల్లవాడ్ని కరిచి చచ్చిన పాము..
పాము కాటుకు గురైన నాలుగేళ్ల బాలుడు అనూజ్కుమార్ని పరిశీలించిన వైద్యులు చిన్నారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ..క్షేమంగానే ఉన్నాడని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చారు. ఈవిషయం స్థానికంగా కలకలం రేపింది. పిల్లవాడ్ని కరిచిన పాము చనిపోతే ...విషసర్పం కాటేసిన తర్వాత కూడా బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిసి అతడ్ని చూడటానికి జనం పెద్ద సంఖ్యలో ఇంటికి చేరుకున్నారు. అనూజ్‌కుమార్ అందరితో నవ్వుతూ మాట్లాడటం చూసారు. మరోవైపు సుమారు ఐదు అడుగుల పొడవున్న విషసర్పం చచ్చిపోయి ఉండటాన్ని చూసి అభం,శుభం తెలియని పసివాడ్ని కాటేసేందుకు వచ్చి ప్రాణం పోగొట్టుకుంది పాము అన్నారు. అయితే విష సర్పం కాటేసిన తర్వాత కూడా పిల్లవాడికి ఏమీ కాకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.