హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు..’.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

‘ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు..’.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రశాంత్ కిషోర్, నితీష్ కుమార్ (ఫైల్)

ప్రశాంత్ కిషోర్, నితీష్ కుమార్ (ఫైల్)

Bihar: బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాట్నాలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

బీహార్ (Bihar) సీఎం నితీష్ కుమార్ (Nitish kumar) కొన్ని రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తు అనేక మంది కీలక నేతలను కలుసుకున్నారు. వచ్చేసార్వత్రిక ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని అపోసిషన్ పార్టీలను ఏకం చేయడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో (Prashanth kishore) భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జనతాదళ యునైటేడ్ కు చెందిన మాజీ నేత పవన్ వర్మ ఈ సమావేశం ఏర్పాడు చేసినట్లు తెలుస్తోంది. పవన్ వర్మ,ప్రశాంత్ కిషోర్ లు ఇద్దరూ రెండేళ్ల క్రితం నితీష్ కుమార్ తో విడిపోయారు.

ఈ క్రమంలో.. కొన్ని రోజుల క్రితమే.. పీకే.. నితీష్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ సైతం.. ప్రశాంత్ పైన తనదైన శైలీలో ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ విధంగా ఇద్దరి మధ్య మాటల్ వార్ జరిగిన కొద్ది రోజులకే వీరి మధ్య భేటీ ఆసక్తి కరంగా మారింది. ఈ క్రమంలో వీరు దాదాపు.. 45 నిముషాలపాటు సమావేశమైనట్లు సమాచారం. వీరి మీటింగ్ తర్వాత.. రిపోర్టర్లు నితీష్ కుమార్ ను పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై నితీష్ కుమార్ సమాధానమిస్తూ.. ఇది కేవలం సాధారణ సమావేశమని, ఏలాంటి రాజకీయాలు చర్చలకు రాలేదని అన్నారు. అదే విధంగా.. పీకే చేసిన వ్యాఖ్యలతో తాను కలతచెందలేదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా  మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnaviss)  భార్య అమృతా ఫడ్నవీస్ ఫేస్ బుక్ లో వేధింపులకు గురయ్యారు.

గుర్తుతెలియని మహిళ ఆమెకు రిక్వెస్ట్ పెట్టింది. దీన్ని యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సీఎం వాల్ మీద.. ఇష్టమోచ్చినట్లు కామెంట్ లు పెడుతుంది. అంతే కాకుండా.. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కంటెంట్ ఉన్న పోస్ట్ లు పెడుతుంది. దీనితో ఆమె సీరియస్ గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను పంచల్ (50) అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె అనేక నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి, ఇలా వేధిస్తుందని అధికారులు గుర్తించారు. ఈ విధంగా దాదాపు.. 53 నకిలీ ఫేస్ బుక్ ఐడీలు, 13 జీమెయిల్ లను క్రియేట్ చేసిందని పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకుని, విచారణ చేపట్టారు.

First published:

Tags: Bihar, Nitish Kumar

ఉత్తమ కథలు