పోలింగ్ డ్యూటీకి వెళ్తే.. బుల్లెట్ తగిలింది

శివేంద్ర కిశోర్‌కు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న వైద్యులు (Image:ANI)

పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు పోలింగ్ అధికారి శివేంద్ర కిశోర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. అయితే, అక్కడ హోంగార్డ్ తన రైఫిల్‌ను శుభ్రం చేస్తున్నాడు. అనుకోకుండా ఆ సమయంలో అది పేలింది.

  • Share this:
    ఎన్నికల విధులకు హాజరైన ఓ పోలింగ్ అధికారికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. బీహార్‌లోని మాధోపూర్ సుందర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శివేంద్ర కిశోర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి మాధోపూర్ సుందర్ అనే గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 275లో విధులు కేటాయించారు. ఈ రోజు పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు పోలింగ్ అధికారి శివేంద్ర కిశోర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. అయితే, అక్కడ హోంగార్డ్ తన రైఫిల్‌ను శుభ్రం చేస్తున్నాడు. అనుకోకుండా ఆ సమయంలో అది పేలింది. దీంతో అక్కడే ఉన్న శివేంద్ర కిశోర్‌ పొట్టలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అక్కడున్నవారు వెంటనే అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముజఫర్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్య చికిత్స కొనసాగుతోంది. ఆరోదశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీహార్‌లో ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
    First published: