నన్నే గుర్తుపట్టవా..పోలీసు అధికారిపై మంత్రి చిందులు

తనను గుర్తుపట్టనందుకు పోలీసు ఆఫీసర్‌పై మంత్రివర్యులు చిందులు తొక్కారు. సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలంటూ పై అధికారికి సూచించారు.

news18-telugu
Updated: February 15, 2020, 11:47 AM IST
నన్నే గుర్తుపట్టవా..పోలీసు అధికారిపై మంత్రి చిందులు
తనను గుర్తుపట్టని పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్ పాండే
  • Share this:
తనను గుర్తుపట్టనందుకు పోలీసు ఆఫీసర్‌పై చిందులు తొక్కారు బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్ పాండే. ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో బీహార్ గవర్నర్‌ ఫగు చౌహాన్‌తో పాటు మంత్రి మంగల్ పాండే పాల్గొన్నారు.  గవర్నర్ పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వీఐపీలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోనికి అనుమతిచ్చారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మంగల్ పాండేని అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గణేశ్ చౌహాన్ పొరబాటున గుర్తుపట్టలేకపోయారు. లోనికి ప్రవేశించకుండా మంత్రిని అడ్డుకున్నారు. దీంతో సదరు పోలీసు ఆఫీసర్‌పై కోపంతో ఊగిపోయారు మంత్రిగారు. మంత్రి కార్యక్రమంలో మంత్రినే గుర్తుపట్టరా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిని గుర్తుపట్టనందుకు...సదరు ఆఫీసర్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారి జితేంద్ర పాండేకి సూచించారు.

బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగల్ పాండే తీరుపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు.  భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారి తనను గుర్తుపట్టలేదని, ఆయన కింది స్థాయి సిబ్బంది ఎదుట మంత్రి అవమానించడం సబబుకాదన్నారు. సస్పెండ్ చేయాల్సింది భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిని కాదు...అధికార మత్తులో మునిగిపోయిన మంత్రిని అంటూ ఎద్దేవా చేశారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు