‘ప్రభుత్వ ఉద్యోగులమైన మేము మద్యం తాగబోమని ప్రమాణం చేస్తున్నాం’

news18-telugu
Updated: July 29, 2019, 4:32 PM IST
‘ప్రభుత్వ ఉద్యోగులమైన మేము మద్యం తాగబోమని ప్రమాణం చేస్తున్నాం’
ఈ సమయంలో సరికొత్త విషయాన్ని వెల్లడించారు అధికారులు. తెలుగురాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయంటూ వెల్లడి..
  • Share this:
‘ప్రభుత్వ ఉద్యోగులమైన మేము మద్యం తాగబోమని ప్రభుత్వం చేస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా, ఎప్పుడైనా, మద్యం తాగుతూ పట్టుబడితే ప్రభుత్వం విధించే ఎలాంటి శిక్ష అయినా భరిస్తాం.’ అని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? బీహార్‌లో. ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. అంటే, ఏ రకమైన మద్యం అయినా సరే విక్రయించడం లేదా తాగడం రెండూ నేరమే. అయితే, కొన్నికొన్నిచోట్ల మద్యం పట్టుబడుతూనే ఉంది. దీంతో సీఎం నితీష్ కుమార్ ఓ ఐడియా వేశారు. మద్యపానాన్ని మానేయాలనే విషయాన్ని అధికారులతో మొదలు పెట్టాలని నిర్ణయించారు. జూన్ 12న నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా మద్యం తాగబోమంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో అందరు ఉద్యోగులు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు