మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఏటా కోట్లాది మంది యువత డిగ్రీ పూర్తి చేస్తున్నా.. వారిలో ఉద్యోగాలు వచ్చేది చాలా తక్కువ మందికి మాత్రమే. అందువల్ల ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందజేస్తోంది. ఆ జాబితాలో బీహార్ ప్రభుత్వం కూడా ఉంది. నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద నిరుద్యోగులకు రెండేళ్లపాటు ప్రతి నెలా వెయ్యి రూపాయలు ఇస్తారు. రెండేళ్లకు మొత్తం రూ.24 వేలు అందజేస్తారు.
నిరుద్యోగ యువత.. స్వయం సహాయక భృతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాల కోసం చూస్తున్న రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అందరికీ ఈ పథకం కింద నిరుద్యోగ భృతి అందించబడుతుంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయంతో... నిరుద్యోగ యువత తమ చిన్నచిన్న ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు.
Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంకులకు 11 సెలవులు... ఎప్పుడెప్పుడంటే
నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసేవారు.. తప్పనిసరిగా బీహార్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 12వ తరగతి ఉత్తీర్ణత, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసే వారికి ఎలాంటి ఉద్యోగం ఉండకూడదు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు.. అనర్హులు. ఏ ఉద్యోగం లేని నిరుద్యోగ యువత.. తమ విద్యార్హత మార్కుల సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ , బ్యాంక్ పాస్‌బుక్‌తో జిల్లా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నిరుద్యోగ యువతకు వరంగా నిలుస్తోందని బీహార్‌లోని సహ్రసా జిల్లా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ సెంటర్ కార్యకర్త కేశవ్‌కుమార్ తెలిపారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెలా వెయ్యి రూపాయల సాయం అందజేస్తోందని.. ఈ చిన్న మొత్తమే అయినా వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ డబ్బుతో ఏదైనా పోటీ పరీక్షకి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 2 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Unemployment