వలస కూలీలకు కండోమ్స్ పంపిణీ.. ఎందుకంటే..

అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: June 2, 2020, 3:51 PM IST
వలస కూలీలకు కండోమ్స్ పంపిణీ.. ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వలస కూలీలకు ఆహార వస్తువులు, నగదు ఇచ్చి ఆదుకోవడం వంటి చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. అయితే బీహార్ ప్రభుత్వం మాత్రం వలస కూలీలకు కండోమ్స్‌ను కూడా పంపిణీ చేస్తోంది. అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు వలస కూలీలకు బిహార్‌ ప్రభుత్వం కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ర్టానికి చేరుకున్న వలస కార్మికులకు 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించేముందు అధికారులు వీరికి కండోమ్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ చర్య అని కోవిడ్‌-19తో ఎటువంటి సంబంధం లేదని స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ఫ్యామిలీ ప్లానింగ్‌ అధికారి ఒకరు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్‌ ముగించుకుని వెళ్లినట్లు తెలిపారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. ఈ నెల 15తో క్వారంటైన్‌ కేంద్రాల సేవలు ముగియనున్నాయి. అప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ర్టానికి చేరుకునే కూలీలు చేరుకుంటారని అధికారులు తెలిపారు.




First published: June 2, 2020, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading