అజంఖాన్ వ్యాఖ్యలను సమర్థించిన మాజీ సీఎం

బీజేపీ ఎంపీ రమాదేవి మీద అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ సమర్థించారు.

news18-telugu
Updated: July 28, 2019, 7:13 PM IST
అజంఖాన్ వ్యాఖ్యలను సమర్థించిన మాజీ సీఎం
ఆజం ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీ ఎంపీ రమాదేవి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజం ఖాన్‌ను బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నాయకుడు జితన్ రామ్ మాంఝీ వెనకేసుకుని వచ్చారు. ఈ నెల 25న లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్‌ చైర్‌లో రమాదేవి కూర్చుని ఉన్న సమయంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అజంఖాన్ మాట్లాడారు. ‘మిమ్మిల్ని చూస్తుంటే అలాగే చూస్తుండి పోవాలని ఉంది.’ అని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. బీజేపీ ఎంపీ రమాదేవికి అజంఖాన్ లోక్‌సభ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే, బీహార్ మాజీ సీఎం మాత్రం అజంఖాన్‌ను వెనకేసుకుని వచ్చారు. ‘సోదరుడు, సోదరి కలసినప్పుడు వాళ్లు ముద్దుపెట్టుకుంటారు. అంటే దాని ఉద్దేశం సెక్స్ అనేనా? ఓ తల్లి తన కొడుకుని ముద్దుపెట్టుకుంటుంది. అది కూడా శృంగారమేనా? అజంఖాన్ వ్యాఖ్యలను వకీృకరించారు. అంటే కారణం లేకుండానే అజంఖాన్ క్షమాపణ చెప్పాలా’ అని జితన్ రామ్ మాంఝీ ప్రశ్నించారు.

First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>