యశ్ హీరోగా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌..

మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కొంత మంది కథానాయకులు..ఆ తర్వాత కాలంలో నాయకులుగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

news18-telugu
Updated: October 31, 2019, 1:16 PM IST
యశ్ హీరోగా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌..
లాలూ ప్రసాద్ యాదవ్(File)
  • Share this:
మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కొంత మంది కథానాయకులు..ఆ తర్వాత కాలంలో నాయకులుగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఇంకోవైపు రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసిన పొలిటిషన్స్ జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అందులో కొందరి నేతలపై ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కుతునాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలోని తాజా, మాజీ ప్రధాన మంత్రుల జీవితాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసిన ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి డజను పైగా చిత్రాలు వెండితెరపై కనువిందు చేసాయి. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రధానమంత్రిగా ఉన్నకాలం నేపథ్యంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. మరోవైపు ప్రదానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్రలపై ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.

bihar ex chief minister lalu prasad yadav biopic on cards bhojpuri actor yash kumar plays lalu charecter,Lalu Prasad Yadav,Lalu Prasad Yadav biopic,Lalu Prasad Yadav latest news,lalu prasad yadav instagram,lalu prasad yadav twitter,lalu prasad yadav facebook,lalu prasad yadav yash,yash kumar plays lalu prasad yadav charecter,ntr,pm narendra modi,jabardasth comedy show,bigg boss final,biopic on Lalu Prasad Yadav,lalu biopic,lalu latest news,bihar lalu news,లాలూ ప్రసాద్ యాదవ్,లాలూ బయోపిక్,లాలూ ప్రసాద్ యాదవ్ తాజా వార్తలు,లాలూ యాదవ్ తెలుగు
లాలూ ప్రసాద్ యాదవ్ (File Photo)

ఇక ఎన్టీఆర్, వైయస్ఆర్ సినిమాలు వెండితెరపై కనువిందు చేసాయి. త్వరలో జయలలిత జీవితంపై మూడు నాలుగు బయోపిక్‌లు రానున్నాయి. తాజాగా ఒకపుడు బీహార్‌ను తను కనుసైగలతో పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘లాంతర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ గుర్తు కూడా లాంతర్ కావడం విశేషం. ఈ సినిమాలో లాలూ ప్రసాద్ యాదవ్ క్యారెక్టర్‌ను ప్రముఖ భోజ్‌పురి నటుడు యష్ కుమార్ నటిస్తున్నారు. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు. లాలూ బయోపిక్‌ను బీహార్, గుజరాత్‌లో షూటింగ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని కుమార్ తెలిపారు.

bihar ex chief minister lalu prasad yadav biopic on cards bhojpuri actor yash kumar plays lalu charecter,Lalu Prasad Yadav,Lalu Prasad Yadav biopic,Lalu Prasad Yadav latest news,lalu prasad yadav instagram,lalu prasad yadav twitter,lalu prasad yadav facebook,lalu prasad yadav yash,yash kumar plays lalu prasad yadav charecter,ntr,pm narendra modi,jabardasth comedy show,bigg boss final,biopic on Lalu Prasad Yadav,lalu biopic,lalu latest news,bihar lalu news,లాలూ ప్రసాద్ యాదవ్,లాలూ బయోపిక్,లాలూ ప్రసాద్ యాదవ్ తాజా వార్తలు,లాలూ యాదవ్ తెలుగు
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (File photo)

దేశ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. ఆయన భాష, యాస, మాటలు ప్రజలను ఆకర్షితులను చేస్తాయి. ఆయన జీవన విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా.. రోజూ ఉదయాన్నే షెడ్లో ఆవులకు పాలు పిండడం వంటి పనులు చేసి వార్తల్లో నిలిచారు. దాణా కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది.జబ్ తక్ సమోసేమే ఆలూ తబ్ తక్ బీహార్‌లో లాలూ అనేది ఆయన నానుడి. అంటే సమోసాలో ఆలూ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఆయన బిహార్‌లో ఉంటాడనేది ఈ సామెత సారాంశం. గత బిహార్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు . లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా  స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ సీఎంగా ఎదిగారు. ముఖ్యంగా బిహార్‌లో యాదవుల్లో లాలూకి ఉన్న ఫాలోయింగ్ ఈ తరం వారికి తెలియజెప్పేందుకే ఈ సినిమాను తీస్తున్నట్టు యష్ కుమార్ తెలిపారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 31, 2019, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading