news18
Updated: November 10, 2020, 12:33 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 10, 2020, 12:33 PM IST
దేశవ్యాప్తంగా కమలం వికసిస్తున్నది. ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే కమల వికాసం స్పష్టంగా కనిపిస్తున్నది. బీహార్లో పోటీ నూవ్వా నేనా అన్నట్టు సాగుతున్నా.. నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయేలో ఆయన సొంత పార్టీ జేడీ(యూ) కంటే బీజేపీ మంచి సీట్లను సాధిస్తున్నది. కౌంటింగ్ మొదట్లో కొంచెం వెనుకబడ్డా బీజేపీ సపోర్ట్ తో ఎన్డీయే మళ్లీ లైన్ లోకి వచ్చింది. ఇప్పుడక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. ఇంకొంతసేపైతే బీహార్ కా బాద్ షా ఎవరో తెలిసిపోనుంది. బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ మీద మరోసారి నమ్మకం ఉంచారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీహార్ కాక ఇతర రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లోనూ కమలం వికసిస్తున్నది.
బీహార్ లో ఎన్డీయే కూటమి 128 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. దాంతో పాటు మద్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మణిపూర్, కర్నాటక, తెలంగాణ లోనూ కమలనాథులు ముందంజలో ఉన్నారు. మద్యప్రదేశ్ లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా అక్కడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నది. తాజా సమాచారం ప్రకారం... మద్యప్రదేశ్ లో బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. మరో రెండు చోట్ల నూవ్వా నేనా అన్నట్టు పోరు కొనసాగుతున్నది. ఇక దాని మద్యప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలైన యూపీలోనూ బీజేపీ హవా స్పష్టంగా తెలుస్తున్నది. అక్కడ కూడా 6 స్థానాల్లో (ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి) విజయం దిశగా ముందుకు సాగుతున్నారు.
ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020
ఇక ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ బీజేపీ ఏడు స్థానాల్లో (8 నియోజకవర్గాల్లో ఎన్నికలు) దూసుకుపోతన్నది. కర్నాటకలో రెండు స్థానాల్లోనూ ఆధిక్యం బీజేపీదే. మణిపూర్ లో ఐదు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా.. అందులో ఒకస్థానంలో ఇప్పటికే బీజేపీ విజయం సాధించింది. మరో రెండు ప్రాంతాల్లో ఆధిక్యం కమలనాథులదే. జార్ఖండ్ లో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతుండగా.. అందులో ఒక చోట బీజేపీ అభ్యర్థి విజయం దిశగా ముందుకెళ్తున్నారు. తెలంగాణలోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్నది.
ఇంగ్లీషులో మధ్యప్రదేశ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి MP By Election Result 2020
కాగా.. హర్యానా, ఛత్తీస్ గఢ్, ఒడిషా, నాగాలాండ్ లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నాలుగు రాష్ట్రాలలో (ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థానం లో ఉప ఎన్నికలు) అధికార పార్టీలే గెలుపుదిశగా పయనిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి చెందిన అభ్యర్థుల విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏదెలా ఉన్నా కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవుతున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు మరో చేదు జ్ఞాపకంగానే మిగిలిపోనున్నాయి. ఇదిలాఉంటే బీజేపీ కార్యకర్తలు మాత్రం సంబురాలకు సిద్ధమవుతున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 12:33 PM IST