news18
Updated: November 10, 2020, 9:48 AM IST
యాగం చేస్తున్న ఎల్జేపీ కార్యకర్తలు
- News18
- Last Updated:
November 10, 2020, 9:48 AM IST
ఒకవైపు బీహార్ ఎన్నికల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీయే, మహాకూటమి ల మధ్య పోటీ నూవ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. రౌండ్ లు మారేకొద్దీ ఫలితాలు మారుతున్నాయి. మహాకూటమికి ఎడ్జ్ ఉన్నా.. పూర్తి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే. బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా అందరిలోనూ ఇదే ఉత్కంఠ. మరోవైపు లోక్ జనశక్తి పార్టీ కార్యకర్తలు మాత్రం వేరే పనిలో బిజీగా ఉన్నారు. పలువురు ఎల్జేపీ కార్యకర్తలు నితీశ్ కుమార్ ఓడిపోవాలని యాగం చేస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ఆలయంలో పలువురు ఎల్జేపీ నాయకులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓడిపోవాలని, ఎల్జేపీ అధికారంలోకి రావాలని వాళ్లు యాగం చేస్తున్నారు. ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకావడానికి కొద్దిసేపు ముందు గానే ఈ యాగం మొదలైంది. ఎల్జేపీకి చెందిన పలువురు కార్యకర్తలు పాట్నాతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కూడా నితీశ్ కుమార్ ను సాగనంపడానికి యాగాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పాట్నాలో నిర్వహించిన యాగం మాత్రం ఆ పార్టీ నాయకుడు కృష్ణ కుమార్ కల్లు నేతృత్వంలో కొనసాగుతున్నది.
ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020
కాగా ఈ సారి ఎన్నికల్లో ఎల్జేపీ సీఎం కుర్చీ దక్కించుకోకపోయినా.. నితీశ్ ను దెబ్బతీయడంలో సఫలీకృతమైంది. ఫలితాల సరళిని చూస్తే అది స్పష్టంగా అర్థమవుతున్నది. ముందునుంచి నితీశ్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న చిరాగ్ పాశ్వాన్.. అదే వైఖరితోనే ఎన్నికలలో పోటీకి దిగారు. ఓట్లను చీల్చడంలో ఆయన పూర్తిగా సఫలీకృతులయ్యారు.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 9:46 AM IST