• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR EARTHQUAKE 4 MAGNITUDE EARTHQUAKE HITS PATNA AND ADJOINING AREAS SK

Bihar Earthquake: బీహార్‌లో భూకంపం.. భయంతో వణికిన జనం

Bihar Earthquake: బీహార్‌లో భూకంపం.. భయంతో వణికిన జనం

ప్రతీకాత్మక చిత్రం

పాట్నాలో భూప్రకంపనలు వచ్చాయని, అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే ఇళ్లకు నుంచి బయట వెళ్లాలని ప్రజలకు సూచించారు.

  • Share this:
    బీహార్‌ రాజధాని పాట్నాను భూకంపం వణికించింది. సోమవారం రాత్రి 09.23 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. నలందకు వాయువ్యంగా 20 కి.మీ.దూరంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. దాని తీవ్రత 3.5గా ఉన్నట్లు తెలిపింది. భూకంప ధాటికి పట్నా సహా పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లలో ఫ్యాన్‌లు, ఇతర వస్తువులు ఊగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరైతే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


    పాట్నాలో భూప్రకంపనలు వచ్చాయని, అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే ఇళ్లకు నుంచి బయట వెళ్లాలని ప్రజలకు సూచించారు.

    కాగా, ఇవాళే అండమాన్ నికోబార్ దీవుల్లలోనూ స్వల్ప భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి 07.23 గంటల సమయంలో పోర్ట్‌బ్లెయిర్‌కు దక్షిణ-ఆగ్నేయ దిశగా 258 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత 4.1గా ఉన్నట్లు పేర్కొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు