హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Police: మద్యం తాగితే విధుల్లోంచి తొలగిస్తాం.. పోలీసులకు డీజీపీ హెచ్చరికలు.. మద్యం తాగబోమంటూ ప్రమాణం

Police: మద్యం తాగితే విధుల్లోంచి తొలగిస్తాం.. పోలీసులకు డీజీపీ హెచ్చరికలు.. మద్యం తాగబోమంటూ ప్రమాణం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఎన్టీఆర్​ అధికారంలో ఉండగా మద్యం నిషేధం అమలైన సంగతి తెలిసిందే. కాగా, ఇపుడు మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు బిహార్ ప్రభుత్వం (Bihar government) చర్యలు ముమ్మరం చేసింది.

మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది... సాయంత్రం కాగానే... మద్యం (alcohol) బాటిల్ ఎత్తేస్తారు. సంపాదించిన కాస్త సొమ్మునూ మద్యానికి వాడేస్తారు. ఫలితంగా తాత్కాలిక కిక్కు... దీర్ఘకాలిక సమస్యల్ని తెచ్చుకుంటారు. ఐతే... మద్యం తాగడం మానేస్తే కలిగే ప్రయోజనాలు, మద్యం మానేస్తే ఎంత మేలో తెలియకపోవడం వల్లే చాలా మంది మద్యం తాగుతూ ఉంటారు. దీనిపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలొచ్చాయి. ఒక్క నెల పాటూ మద్యం మానేసినా చాలు... గుండె, లివర్, బాడీ అన్నీ ఆరోగ్యవంతంగా మారతాయి. నెల తర్వాత మళ్లీ మద్యం తాగడం (alcohol drink) మొదలుపెడితే... మళ్లీ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అయితే చాలా రాష్ట్రాలు మద్య నిషేధం (alcohol ban) అంటూ ఎన్నికల్లో ఊదరగొడుతూ.. అధికారంలోకి రాగానే దానిని పట్టించుకోవడం మానేస్తున్నాయి. అప్పట్లో ఎన్టీఆర్​ అధికారంలో ఉండగా మద్యం నిషేధం అమలైన సంగతి తెలిసిందే. కాగా, ఇపుడు మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు బిహార్ ప్రభుత్వం (Bihar government) చర్యలు ముమ్మరం చేసింది.

రాష్ట్ర అసెంబ్లీలో..

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish kumar) కూడా ఇదే విషయమై ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలోని ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన శుక్రవారం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. ’మద్యంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. మద్యపాన నిషేధాన్ని అధికారులు కఠినంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’ అని పిలుపునిచ్చారు.

మద్యాన్ని జీవితంలో ముట్టబోనని..

సీఎం చొరవతో రాష్ట్ర డీజీపీ సందీప్‌ కుమార్‌ సింఘాల్ (DGP Sandeep Kumar Singhal).. తన సహొద్యోగులతో కలిసి.. మద్యాన్ని జీవితంలో ముట్టబోనని (don’t take alcohol) ప్రమాణం చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. పట్నాలోని పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించే పోలీసు (police) సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని డీజీపీ (DGP) స్పష్టం చేశారు. ఆయన ప్రమాణం చేస్తూ.. ‘సందీప్ కుమార్ సింఘల్ అనే నేను.. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని, జీవితంలో దానిని ఎప్పుడూ ముట్టనని ఈరోజు (నవంబర్ 26) ప్రమాణం చేస్తున్నాను. విధుల్లో ఉన్నా, లేకపోయినా.. నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. రోజువారీ జీవితంలో లిక్కర్ కు తావివ్వను. మద్యపాన నిషేధ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తాను‘ అని డీజీపీ ప్రమాణం చేశారు.

మద్యాన్నిపూర్తిగా నిషేధిస్తామని హామీ..

రాష్ట్రంలోని వివిధ హోటళ్లు, వెడ్డింగ్ హాల్స్​లో పోలీసులు (Police) రైడ్లు చేసి.. మద్యం సేవిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ప్రజలను హింసిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అయితే నితీశ్ కుమార్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిషేధిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయాలకు పూనుకున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Alcohol, Bihar, Police

ఉత్తమ కథలు