తాలిబన్ల ఉన్మాదం తెలియనది కాదు.. సాటి మనుషుల్ని హింసించటంలో వాళ్లకి వాళ్లే సాటి.. వారి ఉగ్ర ఉన్మోదానికి అంతే ఉండదు.. ముఖ్యంగా ఆడవాళ్లపై వాళ్లు చేసే దారుణాలు అన్నీఇన్నీ కావు.. ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో తెలియదు..అదే తలుచుకుంటూ బిక్కు బిక్కు మంటూ బతుకులీడుస్తున్నారు అక్కడ మహిళలు.. తమ మాట వింటే ఒకలాగా వినకపోతే మరోలాగా ప్రవర్తిస్తారు.. ఎదురు తిరిగిన వాళ్లను చెట్టుకు కట్టేసి ఇష్టం వచ్చినట్లు కొడతారు.. ఇక తాలిబన్ల స్థాయి ఉన్మాదం ఇండియాలోని మహిళలపై పలు ప్రాంతాల్లో జరుగుతుండడం మనం చూస్తునే ఉంటాం.. రక్షసత్వం ఒక ప్రాంతానికి, ఇక వర్గానికే పరిమితం కాదు కదా.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇలాంటి హింసకు పాల్పడే వారుంటారు.. భారత్ ఆ హింసకు అతీతమేమీ కాదు.. అందులో బీహార్‌లో ఈ తరహా ఘటనలు ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయి.. మరోసారి అదే జరిగింది.. ఒక మహిళ దుస్తులు లాగేసి.. చెట్టుకు కట్టేసి.. జుట్టు పీకేసి.. తాలిబన్ల తరహాలో మహిళపై దాడికి పాల్పడ్డారు.
అర్ధనగ్నంగా కట్టేసి కట్టారు:
బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఓ మహిళను తాలిబన్లు తరహాలో అర్ధనగ్నంగా కట్టేసి, ఆమె జుట్టును కట్ చేశారు. ఆమెపై దారుణంగా దాడి చేశారు. బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది.. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగదీష్ సాహ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి తనను అర్ధనగ్నంగా చేసి రెండు చేతులు కట్టేసి జుట్టు కట్ చేశాడని బాధితురాలు చెబుతోంది. అదే సమయంలో వాళ్ల కుటుంబసభ్యులు తనను తీవ్రంగా కొట్టారని.. శరీరమంతా రక్తం కారుతున్నా కనీకరించలేదని బాధితురాలు వాపోయింది. దాడి తర్వాత మొదట ఆమెను డీఎంసీహెచ్‌లో చేర్పించారు. చికిత్స తర్వాత మార్చి 27న పోలీస్ స్టేషన్ కు వెళ్లి మొత్తం 10 మందిపై కంప్లైంట్ చేసింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దీంతో బాధిత మహిళ న్యాయం కోసం సీనియర్ అధికారి కార్యాలయానికి వెళ్లింది.
ఎందుకు దాడి చేశాడు?
జగదీష్ సాహ్ కూతురు కొన్ని రోజులుగా కనిపించడంలేదు. ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందన్న ప్రచారం జరుగుతోంది.. అయితే ఆమె వెళ్లిపోవడానికి బాధిత మహిళే కారణమని జగదీష్ అనుమానించాడు.. తన కూతురు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలంటూ దాడి చేశాడు.. తనకు తెలియదని ఎంత బతిమాలుడుతున్నా అతడు మాట వినలేదు.. ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాకుండా.. అందరి ముందు చెట్టుకు కట్టేసి విచక్షణ మరిచి కొట్టాడు.. అంతటితో ఆగకుండా ఆమె జట్టును కట్ చేశాడు..ఇక బాధితురాలి కుటుంబపైనా జగదీష్ దాడి చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరినీ చితకబాది, కాళ్లు, చేతులు కట్టేసి కొట్టినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.