హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇదేందయ్యా ఘోరం : రూ.37 లక్షల ఆదాయపు పన్ను కట్టాలని రోజువారీ కూలీకి నోటీసులు

ఇదేందయ్యా ఘోరం : రూ.37 లక్షల ఆదాయపు పన్ను కట్టాలని రోజువారీ కూలీకి నోటీసులు

Daily Wager gets IT notice : అతడో సాధారణ కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చే అరకొర డబ్బులతో బతుకు బండిని లాగుతోన్న అతడికి తాజాగా ఐటీ శాఖ నుంచి నోటీసులు(IT Notice To Daily Wager)వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Daily Wager gets IT notice : అతడో సాధారణ కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చే అరకొర డబ్బులతో బతుకు బండిని లాగుతోన్న అతడికి తాజాగా ఐటీ శాఖ నుంచి నోటీసులు(IT Notice To Daily Wager)వచ్చాయి. రూ.37.5 లక్షలు ఆదాయ పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. దీంతో అవాక్కవడం అతడి వంతైంది. ఆదాయ పన్ను(Income Tax) అంటే ఏంటో కూడా తెలియని అతడికి ఈ నోటీసులు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం చేయాలో పాలుపోక పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఈ సంఘటన బీహార్‌(Bihar) రాష్ట్రంలోని ఖజారియా జిల్లాలో జరిగింది.

బీహార్ ​లోని ఖగాడియా జిల్లా మఘౌనా గ్రామంలో గిరీశ్ యాదవ్ అనే వ్యక్తి రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. గిరీశ్ యాదవ్​ కు.. తన పేరు మీద బకాయి పడిన రూ.37.5 లక్షలను వెంటనే చెల్లించాలని ఇటీవల ఐటీ శాఖ నోటీసులు పంపింది. ఆ నోటీసులో అతడి పేరు, పాన్ నెంబర్ ఉన్నాయి. రాజస్తాన్ చెందిన ఓ కంపెనీతో సంబంధం ఉన్న గిరీష్‌ రూ. 37.5 లక్షల ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు. రోజుకు రూ.500లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గిరీష్‌కి ఆ నోటీసు చూడగానే గిరీష్‌కి దిమ్మ తిరిగింది. వెంటనే గిరీష్ యాదవ్ అలౌలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు విషయం చెప్పాడు. అసలు తానెప్పుడూ రాజస్తాన్ వెళ్లలేదని,తనకు కనీసం పాన్‌కార్డు కూడా లేదని, ఢిల్లీలో పనిచేసేటప్పుడు పాన్ కార్డు కోసం ప్రయత్నించినా రాలేదని చెప్పాడు. రాజస్తాన్‌ కంపెనీ గురించి తనకేం తెలియదని తెలిపాడు.

Viral Video : బరితెగించిన మహిళ..అలా చూపిస్తూ సెక్యూరిటీ గార్డుపై దాడి

"గిరిష్‌ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇది మోసానికి సంబంధించిన కేసుగా అర్ధమవుతోంది" అని అలౌలి పోలీస్‌ స్టేషన్‌ ఎస‍్సై పూరేంద్ర కుమార్‌ తెలిపారు. బాధితుడి పాన్‌ నెంబర్‌పై జారీ అయిన నోటీసులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో గిరిష్‌ ఢిల్లీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాడని, ఆ సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా పాన్‌కార్డ్‌ కోసం ప్రయత్నించినట్లు చెప్పాడని,ఆ తర్వాత ఆ మధ్యవర్తి కనిపించకుండా పోయినట్లు తెలిపాడన్నారు. ఫ్రాడ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా,గతంలో కూడా కూలీపనులు చేసుకునే కొందరికి ఇలానే ఐటీ నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Income tax, Labour

ఉత్తమ కథలు