CM Nitish Kumar Convoy Attacked: బీహార్(Bihar)సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్(CM Nitish Kumar)సోమవారం గయాలో పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం సీఎం కాన్వాయ్ ఆదివారం సాయంత్రం పట్నా(Patna)నుంచి గయాకు బయల్దేరింది. గౌరిచక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్గి గ్రామంలో నితీశ్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. కాన్వాయ్ ని ఆపి ఇనుప రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. ఈ దాడిలో నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన కాన్వాయ్‌లో నితీశ్ భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు.
సీఎం కాన్వాయ్ పై దాడికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్యులేట్ అయ్యాయి. ఆ వీడియోలలో... కారు టైర్లు, వెదురు బొంగులను తగులబెట్టి రోడ్డును అడ్డుకున్న భారీ గుంపు కనిపించింది. ఆ భారీ గుంపు వాహనాలపై రాళ్లు రువ్వి, రాడ్లతో అద్దాలు పగులగొట్టినట్లు వీడియోలలో కనిపిస్తోంది.
చాలా రోజులుగా కనిపించకుండా పోయిన ఓ యువకుడు శవమై కనిపించడంతో స్థానికులు ఆందోళనకు దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తి గౌరీచక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడి కుటంబసభ్యులు మృతదేహంతో నిరసనలు చేపడుతున్న క్రమంలో సీఎం కాన్వాయ్ సోహ్గి మోర్ ప్రధాన రహదారిపైకి చేరుకుంది. ఈ సమయంలోనే దాడి జరిగింది. సమాచారం అందిన కాసేపటికే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
షాకింగ్ సర్వే : మహిళలకే ఎక్కువ ఎఫైర్లు..ఏపీ,తెలంగాణలో అయితే
బీహార్‌లో మళ్లీ అక్రమాస్తుల రోజులు వచ్చాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని పలువురు నెటిజన్లు ఈ వీడియోలపై కామెంట్స్ చేస్తుండగా, ఇదంతా బీజేపీ కుట్ర అని అంటున్నారు.
కాగా,నితీష్ కుమార్ ఇటీవల బీజేపీతో కూటమి బంధం తెంచుకొని ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయడం,వెంటనే ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయింది. రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడంటే అప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చుకునే విదేశీ అమ్మాయిలో పోల్చారు. బీజేపీతో ఉన్న పొత్తును రద్దు చేసుకుని, మహాఘటబంధన్‌తో చేతులు కలిపారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Nitish Kumar