Home /News /national /

ముసలోడేగానీ ఈ వయసులోనూ.. బీహార్ సీఎంపై విమర్శల వెల్లువ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేని అంతమాట అనేశాడేం?

ముసలోడేగానీ ఈ వయసులోనూ.. బీహార్ సీఎంపై విమర్శల వెల్లువ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేని అంతమాట అనేశాడేం?

బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ, బిహార్ సీఎం నితీశ్, లాలూ కూతురు రోహిణి

బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ, బిహార్ సీఎం నితీశ్, లాలూ కూతురు రోహిణి

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నోటి దురుసు నేతలు చివరికి సారీ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉదంతం మర్చిపోకముందే, రాజకీయ వేదికలపై మహిళలల్ని కించపర్చిన మరో ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది. ఈసారి సాక్షాత్తూ ముఖ్యమంత్రివర్యులే సహచర మహిళా ఎమ్మెల్యేపై.. అదికూడా సొంత పక్షానికి చెందిన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ సీరియస్ మీటింగ్ లో కీలక అంశంపై ఎమ్మెల్యే మాట్లాడటానికి ప్రయత్నిచగా.. కించపర్చే వ్యాఖ్యలతో సీఎం అడ్డుకున్నాడు..

ఇంకా చదవండి ...
రాజకీయాలకు సంబంధం లేని మహిళలపై అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసి.. దానిపై పెను దుమారం చెలరేగడంతో నోటి దురుసు నేతలు చివరికి సారీ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉదంతం జాతీయ రాజకీయాల్లోనూ చర్చ కావడం తెలిసిందే. రాజకీయ వేదికలపై మహిళలల్ని కించపర్చే అంశానికి సంబంధించి ఏపీ ఘటన మర్చిపోకముందే బీహార్ లో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి సాక్షాత్తూ ముఖ్యమంత్రివర్యులే సహచర మహిళా ఎమ్మెల్యేపై.. అదికూడా సొంత పక్షానికి చెందిన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ సీరియస్ మీటింగ్ లో కీలక అంశంపై ఎమ్మెల్యే మాట్లాడటానికి ప్రయత్నిచగా.. కించపర్చే వ్యాఖ్యలతో సీఎం అడ్డుకున్నాడు. సీఎం మాటలకు నొచ్చుకున్న ఆ ఎమ్మెల్యే హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మహిళామణులు, ప్రతిపక్ష మహిళా నేతలు భగ్గుమన్నారు. ‘ఈ వయసులోనూ ఇదేం పాడు పద్దతి..’అంటూ సీఎంపై నిప్పులు కక్కారు. వివరాలివి..

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ సారధి నితీశ్ కుమార్(70) ఇప్పుడొక కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. మిత్రపక్షమైన బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే కటోరియా నిక్కీ హెంబ్రోమ్‌ (48) ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం వ్యాఖ్యలు నన్నెంతగానో బాధించాయి. ముమ్మాటికీ అవి అభ్యంతరకరంగానే ఉన్నాయి. పదే పదే ఆయనిలా మహిళల్ని ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. ఈ విషయమై మా హైకమాండ్ కు ఫిర్యాదు చేశాను’అని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల చివరిరోజైన శుక్రవారం అసెంబ్లీలోనూ ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు.

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్



బీహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మద్య నిషేధంపై భిన్న చర్చ జరిగింది. రాష్ట్రంలో మద్య నిషేధం అమలువున్నా, అన్ని దిక్కులా మద్యం ఏరులై పారుతోందని విపక్షం ఆరోపించింది. మరీ ఘోరంగా అసెంబ్లీ ఆవరణలోనే తాగిపారేసిన మద్యం సీసాలు లభించడం సంచలనం రేపింది. మద్యనిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామంటూ సీఎం నితీశ్ తోపాటు అధికార ఎన్డీఏ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణాలు చేసిన మరుసటిరోజే మద్యం సీసాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మద్యం వ్యవహారంలో విపక్ష ఆర్జేడీ విమర్శలను తిప్పికొట్టడంతోపాటు మద్య నియంత్రణ చర్యలపై చర్చించేందుకు సీఎం నితీశ్ నేతృత్వంలోనే బుధవారం నాడు ఎన్డీఏ సమాశేశం జరిగింది. ఆ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి నితీశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

viral video : విమానాన్ని చేతులతో నెట్టుకుంటూ తీసుకెళ్లిన ప్రయాణికులు -అసలేం జరిగిందంటే..



ఎన్డీఏ సమావేశంలో ప్రధానంగా మద్య నిషేధంపై చర్చ జరగ్గా, బీహార్ లో మ‌హువా(గుడుంబాకు సమానమైన) పానీయం త‌యారీలో ఉపాధి పొందుతున్న వారికి ప్ర‌త్యామ్నాయం చూపాల‌ని బీజేపీ ఎమ్మెల్యే నీక్కీ కోరారు. ఆమె మాటలు పూర్తి కాకముందే సీఎం నితీశ్ జోక్యం చేసుకుంటూ.. ‘అబ్బో.. నువ్ చాలా అందగత్తెవేలే..’అని అనడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. మహిళా ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకపోగా, సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేయడంతో నిక్కీ అవమానంగా ఫీలయ్యారు. మహిళను కించపర్చేలా సీఎం వ్యాఖ్యలు చేశారని నిక్కీ ఆరోపించారు. అయితే..

konijeti rosaiah : వైఎస్సార్‌ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడిని -రోశయ్య సంచలన వ్యాఖ్యలు -viral video



మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి అందంగా ఉన్నావంటూ సీఎం నితీశ్ చేసిన కామెంట్లపై రభస పెద్దది కావడంతో జేడీయూ వివరణ ఇచ్చుకుంది. నిజానికి నితీశ్ మహిళల్ని ఎంతో గౌరవిస్తున్నారని, ఆయన బ్యూటిఫుల్ అనే పదాన్ని వాడిన తీరును బీజేపీ ఎమ్మెల్యే తప్పుగా అర్థం చేసుకుందని, మహువా తయారీలో ఉపాధి పొందిన గిరిజనులకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించిందని, ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యేకు తెలీదా? అనే అర్థంలోనే నితీశ్ మాట్లాడారని జేడీయూ నేత లేసి సింగ్ వివరణ ఇచ్చారు. ఈ ఉదంతంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందిస్తూ సీఎంను త‌ప్పుప‌ట్టారు. ఈ వ‌య‌సులో కూడా చాచా(బాబాయి) అభాసుపాల‌య్యారని ఎద్దేవా చేశారు. జేడీయూకు తక్కువ సీట్లు దక్కినా ముందే చేసుకునన ఒప్పందం మేరకు నితీశ్ కుమార్ ను సీఎం చేయగా, గడిచిన ఏడాదిన్నరగా జేడీయూ-బీజేపీ మధ్య నిత్యం తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్యూటిఫుల్ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి..
Published by:Madhu Kota
First published:

Tags: Bihar, Nitish Kumar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు