హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

లాలు ప్రసాద్ యాదవ్ పై చార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ.. అసలేం జరిగిందంటే

లాలు ప్రసాద్ యాదవ్ పై చార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ.. అసలేం జరిగిందంటే

లాలు ప్రసాద్ యాదవ్ (ఫైల్)

లాలు ప్రసాద్ యాదవ్ (ఫైల్)

Bihar: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పై సీబీఐ చార్జీషిట్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

భూ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్,  బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై (lalu prasad yadav)  సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో, ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) భోలా యాదవ్‌ను సిబీఐ ( Central Bureau of Investigation) అరెస్టు చేసినట్లు అధికారులు  తెలిపారు.

రైల్వే ఉద్యోగాల కోసం వారి యజమానులకు, వారి కుటుంబాలకు బదులుగా పాట్నాలోని ప్రధాన ఆస్తులను మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు విక్రయించడం లేదా బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాలలో తీవ్ర దుమారంగా మారింది.

ఇదిలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) జమ్మూ కశ్మీర్ పర్యటన (Jammu - Kashmir Tour) ముగిసింది. బుధవారం బారాముల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపైతీవ్ర ఆరోపణలు చేశారు. జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధికి 70 ఏళ్లుగా ఏం చేశారని అడిగారు. యువత చేత్తుల్లో రాళ్లు, తుపాకీలు పెట్టారని మండిపడ్డారు. అబ్దుల్లా, ముఫ్తీలు, గాంధీలు 70 సంవత్సరాలకు పైగా జమ్మూ కశ్మీర్‌ను పాలించారని.. కేవలం రూ.15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

కేవలం మూడు సంవత్సరాలలోనే ఈ ప్రాంతానికి రూ.56,000 కోట్ల పెట్టుబడి వచ్చేలా మోదీ కృషి చేశారని వివరించారు. IIT, AIIMS, NIT, NIFT, అదనపు వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలను తీసుకొచ్చామని చెప్పారు. అక్టోబర్ 5న బారాముల్లాలో జరిగిన సభలో గుప్కార్ కూటమిని ఉద్దేశించి.. ‘మేం కశ్మీర్‌ లోయలోని ప్రజలు చెప్పిందే వింటాం, వారితోనే మాట్లాడుతాం.. పాకిస్థాన్‌తో కాదు’ అన్నారు.

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులను ఉద్దేశించి షా మాట్లాడుతూ.. ‘నేను పాకిస్థాన్‌తో మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు. పాకిస్థాన్‌ మాట వినాలని వారు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని అంగీకరించరు. ఉగ్రవాదం నుంచి దాదాపుగా జమ్మూ & కశ్మీర్‌కు ప్రధాని విముక్తి కల్పించారు.’ అని చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో ప్రాంతీయ నేతలు గమనించాలని అమిత్‌ షా సూచించారు. కరెంటు, నీళ్లు అందుబాటులో లేవని, ఆసుపత్రులు కూడా లేవని చెప్పారు. కశ్మీర్‌లో మాత్రం ప్రతి గ్రామానికీ విద్యుత్తు సదుపాయం ఉందని తెలిపారు. తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న కశ్మీర్‌.. ఇప్పుడు పర్యాటకానికి హాట్‌స్పాట్‌గా మారిందని, సంవత్సరానికి కేవలం ఆరు లక్షల మంది పర్యాటకులు వచ్చేవారని, ఇప్పుడు అక్టోబర్ వరకే 22 లక్షల మంది పర్యాటకులు వచ్చారని షా వివరించారు.

First published:

Tags: Bihar, Fraud, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు