హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Assembly: అసెంబ్లీ స్పీకర్ రాజీనామా.. బలపరీక్షకు ముందు బీహార్ రాజకీయాల్లో ట్విస్ట్.. !

Bihar Assembly: అసెంబ్లీ స్పీకర్ రాజీనామా.. బలపరీక్షకు ముందు బీహార్ రాజకీయాల్లో ట్విస్ట్.. !

విజయ్ కుమార్ సిన్హా

విజయ్ కుమార్ సిన్హా

Bihar Assembly: మరికాసేపట్లో బలపరీక్ష మొదలు కానుండగా.. అంతలోనే స్పీకర్ పదవికి విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha) రాజీనామా చేశారు. రాజీనామాకు ముందుకు అసెంబ్లీ మాట్లాడిన ఆయన ...  స్పీకర్ పదవిని పంచ పరమేశ్వర్‌తో పోల్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బలపరీక్షకు ముందు బీహార్ రాజకీయాల్లో  (Bihar Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. మరికాసేపట్లో బలపరీక్ష మొదలు కానుండగా.. అంతలోనే స్పీకర్ పదవికి విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha) రాజీనామా చేశారు. రాజీనామాకు ముందుకు అసెంబ్లీ మాట్లాడిన ఆయన ...  స్పీకర్ పదవిని పంచ పరమేశ్వర్‌తో పోల్చారు. స్పీకర్ను అనుమానించి.. ఎలాంటి సందేశం పంపుదామనుకుంటున్నారని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.  ప్రజలే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అంతకుముందు స్పీకర్‌పై  అవిశ్వాస తీర్మానం (No confidence Motion) ప్రవేశపెడుతూ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించారు. ఐతే అవి నిబంధనలన ప్రకారం లేవని తిరస్కరించారు. ఆ తర్వాత కాసేపటికే రాజీనామా చేశారు విజయ్ కుమార్ సిన్హా.బీహార్‌తో జేడీయూ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలవుతోంది. ఐనప్పటికీ బీజేపీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేయలేదు. సాధారణంగా ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు.. గతంలో ఆ ప్రభుత్వం ఎన్నుకున్న స్పీకర్ కూడ రాజీనామా చేస్తారు.కానీ బీహార్‌లో అలా జరగలేదు. విజయ్ కుమార్ సిన్హా తన పదవిలో కొనసాగుతున్నారు. పదవిని వీడేందుకు నిరాకరిస్తున్న ఆయనపై జేడీయూ, ఆర్జేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతలోనే ఆయన రాజీనామా చేశారు. తాను ముందే రాజీనామా చేద్దామని అనుకున్నా... తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పేందుకే ఇన్ని రోజులు ఆగినట్లు తెలిపారు.
మరోవైపు అసెంబ్లీలో బల పరీక్షకు  (Bihar Assembly Floor Test) ముందు ఆర్జేడీ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై సీబీఐ దాడులు చేసింది. బుధవారం పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీలు సునీల్ సింగ్, సుబోధ్ రాయ్, రాజ్యసభ సభ్యుడు అష్ఫాక్ కరీం ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 'ల్యాండ్ ఫర్ జాబ్స్' కుంభకోణం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఆర్జేడీ నేతల ఇళ్లల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై బీహార్ మాజీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి స్పందించారు. వారు తమని భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కానీ బీహార్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు ఉందని స్పష్టం చేశారు.

First published:

Tags: Bihar, National News

ఉత్తమ కథలు