Bihar Election Result 2020: ఆసక్తిగా బీహార్‌ ఫలితాలు. గట్టిగా తలపడుతున్న NDA, మహాకూటమి

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్డీయే, మహాకూటమి నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది.

news18-telugu
Updated: November 10, 2020, 10:14 AM IST
Bihar Election Result 2020: ఆసక్తిగా బీహార్‌ ఫలితాలు. గట్టిగా తలపడుతున్న NDA, మహాకూటమి
Bihar Election Result 2020: ఆసక్తిగా బీహార్‌ ఫలితాలు. గట్టిగా తలపడుతున్న NDA, మహాకూటమి (credit - twitter - ANI)
  • Share this:
Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA రెండో రౌండ్ ముగిసే సరికి కొద్దిగా ఆధిక్యం సాధించింది. వెంటనే RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి కూడా దూసుకొచ్చింది. మొత్తంగా ఏ కూటమికీ ఇంకా స్పష్టమైన ఆధిక్యం కనిపించట్లేదు. ఇతరుల ఓట్లు కీలకంగా మారేలా కనిపిస్తున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ప్రస్తుతం ఎన్టీయే కూటమి 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... మహాకూటమి 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 5, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ట్రెండ్ చూస్తే... అధికారం చేపట్టేందుకు ఇతరుల సాయం తప్పనిసరి అని అర్థమవుతోంది.

Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్‌లో గెలుపు ఎవరిది? నేడే జడ్జిమెంట్ డే

పార్టీల వారీగా ఆధిక్యం: మహా కూటమి:
పార్టీల వారీగా చూస్తే... మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా మహా కూటమిలోని... BJP 60, JDU 44, అలాగే... VIP 3, HAMS 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

మహాకూటమి
మహాకూటమిలో చూస్తే... RJD 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఐఎంఎల్ఎల్ 8, సీపీఎం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

LJP

ఎల్జేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇతరులు:
BSP-1, MIM 1 స్థానం, IND 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
Published by: Krishna Kumar N
First published: November 10, 2020, 10:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading