• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 TRENDS SHOW THAT JDU AND RJD BOTH PARTIES LOSS VOTES NK

Bihar Election Result 2020: బీహార్‌లో అగ్రనేతగా తేజస్వీ యాదవ్... నితీశ్‌ కుమార్‌కి షాక్

Bihar Election Result 2020: బీహార్‌లో అగ్రనేతగా తేజస్వీ యాదవ్... నితీశ్‌ కుమార్‌కి షాక్

బీహార్‌లో అగ్రనేతగా తేజస్వీ యాదవ్... నితీశ్‌ కుమార్‌కి షాక్

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్నో సరికొత్త మార్పులకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా తేజస్వీ యాదవ్... బీహార్ రాజకీయాల్లో సరికొత్త అగ్రనేతగా మారారు.

  • Share this:
    Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇస్తున్న తీర్పును చూస్తే... కూటముల వారీగా... బీజేపీతో కలిసున్న జేడీయూ... మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఉన్నా... పార్టీల వారీగా చూస్తే మాత్రం... జేడీయూ కంటే... ఎక్కువ స్థానాల్లో RJD ఆధిక్యంలో ఉండేలా చేస్తూ... ఆ పార్టీకి అన్నీ తానై నడిపించిన తేజస్వీ యాదవ్... ఇప్పుడు బీహార్‌లో తిరుగులేని నేతగా ఎదిగారనుకోవచ్చు. నితీశ్ కుమార్‌తో తలపడిన ఈ కుర్ర నేత... జేడీయూ మరింత పతనమయ్యేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు బీహార్‌లో పెద్ద పార్టీలు ఏవంటే... బీజేపీ, RJD మాత్రమే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ బీహార్‌ని శాశించిన JDU ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు RJD, కాంగ్రెస్‌ల మహా కూటమి అధికారంలోకి రాకపోయినా... ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ... తన మార్క్ చూపించేందుకు తేజస్వీ యాదవ్‌కి అవకాశాలు మరింత బలపడ్డాయి అనుకోవచ్చు.

    RJDకి షాక్ ఇచ్చిన బీజేపీ:
    ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికర విషయం కూడా కనిపిస్తోంది. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ... బీహార్‌లో JDU సీట్లలోనూ ఆధిక్యంలో కనిపిస్తోంది. 2015లో జేడీయూ 80 స్థానాలు సాధించగా... ఇప్పుడు 62 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. 18 స్థానాల్లో వెనకబడి ఉంది. బీజేపీ 14 ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ... మొత్తంగా 67 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ 20 స్థానాల్లో వెనకబడి... 51 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇలా స్థానిక పార్టీల కంటే... బీజేపీ తన ఓట్లను మెరుగుపరచుకున్నట్లు కనిపిస్తోంది. చివరకు... ఇకపై పోటీ అంటే... BJP వర్సెస్ RJD అయినపోయినట్లే. 2025 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ కనిపించే ఛాన్స్ ఉంది.

    Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: బీహార్‌లో మెజారిటీ మార్క్ దాటిన ఎన్డీయే, దుబ్బాకలో బీజేపీ హవా

    ప్రభావం చూపిస్తున్న ఇతరులు:
    ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే... CPIMLL పార్టీ... ఇదివరకు 2015లో 3 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు మొత్తం 12 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఐతే... ఈ పార్టీ మహాకూటమిలో భాగంగా ఉంది. దీంతోపాటూ... ఇదే కూటమిలో ఉన్న సీపీఎం 5 స్థానాల్లో, సీపీఐ 3 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. 2015లో వీటికి ఒక్క సీటూ లేదు.

    ఇక ఎల్జేపీ ఎక్కువ ప్రభావం చూపకపోయినా... 2 స్థానాల్లో మాత్రం ఆధిక్యంలో ఉంటోంది.

    ఇప్పటివరకూ 2 సిట్టింగ్ స్థానాలు కలిగివున్న MIM మళ్లీ వాటిని దక్కించుకునేలా కనిపిస్తోంది.

    ఇదివరకు 4 స్థానాల్లో ఉన్న IND ఈసారి... 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    BSP... 2 సిట్టింగ్ స్థానాల్లో ఒకటి కోల్పోతున్నట్లు కనిపిస్తుండగా.... మరొకదాంట్లో ఆధిక్యంలో ఉంది.

    బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ప్రస్తుతం NDA కూటమి 121 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
    Published by:Krishna Kumar N
    First published: