• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 TRENDS SHOW NO ALLIANCE GETS REQUIRED SEATS NK

Bihar Election Result 2020: ఉత్కంఠగా బీహార్‌ ఫలితాలు... NDA, మహాకూటమి మధ్య హోరాహోరీ

Bihar Election Result 2020: ఉత్కంఠగా బీహార్‌ ఫలితాలు... NDA, మహాకూటమి మధ్య హోరాహోరీ

ఉత్కంఠగా బీహార్‌ ఫలితాలు... NDA, మహాకూటమి మధ్య హోరాహోరీ

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్డీయే, మహాకూటమి మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యం రావట్లేదు.

  • Share this:
    Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA కాస్త ముందంజలో కనిపిస్తోంది. ఐతే... RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి గట్టి పోటీ ఇస్తోంది. మొత్తంగా ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యం కనిపించట్లేదు. ఇతరుల ఓట్లు కీలకంగా మారేలా కనిపిస్తున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ప్రస్తుతం ఎన్టీయే కూటమి 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... మహాకూటమి 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 5, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ట్రెండ్ చూస్తే... అధికారం చేపట్టేందుకు ఇతరుల సాయం తప్పనిసరి అని అర్థమవుతోంది.

    పార్టీల వారీగా ఆధిక్యం:
    పార్టీల వారీగా చూస్తే... మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా... BJP 56, JDU 44, స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే... మహాకూటమిలో చూస్తే... RJD 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఐఎంఎలఎల్ 6, ఎల్జేపీ 5, సీపీఎం 4, బీఎస్పీ 2, సీపీఐ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు