• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 TEJ PRATAP YADAV TRAILING FROM HASANPUR SEAT NK

Bihar Election Result 2020: బీహార్‌లో తేజస్వికి షాక్... తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజ

Bihar Election Result 2020: బీహార్‌లో తేజస్వికి షాక్... తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజ

తేజ్ ప్రతాప్ యాదవ్

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. తన అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ వెనకంజలో ఉండటం తేజస్వి యాదవ్‌కి సవాలుగా మారింది.

  • Share this:
    Bihar Assembly Election Result 2020: బీహార్... హసన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన యాదవ కుటుంబంలోని తేజ్ ప్రతాప్ యాదవ్... వెనకంజలో ఉన్నారు. వైశాలీ జిల్లాలోని మహువా అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తేజ్... ఈసారి తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. హసన్‌పూర్‌లో యాదవులు, ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. తన అన్న గెలుపు కోసం ఆర్జేడీ సారధిగా... తేజస్వీ యాదవ్ చాలా కృషి చేశారు. తేజ్ ప్రతాప్‌కి పోటీగా అధికార జేడీయూ... సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాయ్‌ని బరిలో దింపింది. ఈయన 2015లో BLSP నుంచి బరిలో దిగిన బినోద్ చౌదరిని ఓడించారు. ఆ తర్వాత కేబినెట్ లో చరి... ఆరోగ్య శాఖ మంత్రిగా మారారు. 2015 నవంబర్ నుంచి 2017 జులై వరకూ పనిచేశారు. అలాగే... 2015 డిసెంబర్‌లో పర్యావరణ మంత్రిగానూ చేశారు.




    తేజ్ ప్రతాప్ యాదవ్... బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌, రబ్రీదేవికి ఉన్న ఏడుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకుల్లో... పెద్దవాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తన వృత్తి... వ్యాపారం, సోషల్ వర్క్ అని చెప్పారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఇంటర్ వరకూ చదివిన ఆయన... తన వయసు 30 ఏళ్లు అని చెప్పారు. తనకు రూ.2.8 కోట్ల ఆస్తులు ఉన్నాయనీ... వాటిలో... రూ.1.2 కోట్లు చరాస్తులు, రూ.1.6 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.3.1 లక్షలు సంపాదిస్తాననీ... అదే తన ఆదాయం అని ఆయన వివరించారు. తనకు రూ.17.6 లక్షల అప్పులు ఉన్నట్లు చెప్పారు. తనపై 3 క్రిమినల్ కేసులు నమోదైనట్లు వివరించారు.

    Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్‌లో గెలుపు ఎవరిది? నేడే జడ్జిమెంట్ డే

    తేజస్వి యాదవ్‌కి షాక్:
    ఈసారి ఎన్నికల్లో పార్టీకి అన్నీ తానై నడిపించిన తేజస్వి యాదవ్... తన అన్నను గెలిపించుకోలేకపోతున్నట్లు ఫలితాల ట్రెండ్స్‌ని బట్టీ అర్థమవుతోంది. ఐతే... రాజకీయ విశ్లేషకుల అంచనా మరోలా ఉంది. తేజ్ ప్రతాప్ ఎదుగుదల వల్ల... తేజస్వి యాదవ్‌కి రాజకీయ సమస్యలు ఉంటాయనీ... అదే తేజ్ ప్రతాప్ ఓడిపోతే... అది తేజస్వికి... పార్టీలో మరింత పట్టు పెంచుకోవడానికి మార్గం చూపిస్తుందని అంటున్నారు.

    బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు