• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 NDA AGAIN TO FORM GOVERNMENT IN BIHAR ACCOURDING TO EARLY TRENDS NK

Bihar Election Result 2020: బీహార్‌లో మళ్లీ NDA ప్రభుత్వం వచ్చే ఛాన్స్...

Bihar Election Result 2020: బీహార్‌లో మళ్లీ NDA ప్రభుత్వం వచ్చే ఛాన్స్...

బీహార్‌లో మళ్లీ NDA ప్రభుత్వం వచ్చే ఛాన్స్...

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడిప్పుడే పిక్చర్ క్లారిటీ వస్తోంది. NDA కూటమికే ప్రజలు మరోసారి ఛాన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

  • Share this:
    Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గట్టి పోటీ ఇచ్చిన RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి రౌండ్లు ముగిసేకొద్దీ... క్రమంగా వెనక్కి తగ్గుతోంది. మొత్తంగా చూస్తే... కావాల్సిన 122 సీట్లూ స్వయంగా సాధించి... LJP అవసరం లేకుండానే... NDA కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ప్రస్తుతం ఎన్టీయే కూటమి 122 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... మహాకూటమి 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ట్రెండ్ చూస్తే... అధికారం చేపట్టేందుకు ఇతర పార్టీల అవసరం NDAకి లేనట్లే కనిపిస్తోంది.

    పార్టీల వారీగా ఆధిక్యం: మహా కూటమి:
    పార్టీల వారీగా చూస్తే... మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా మహా కూటమిలోని... BJP 63, JDU 57, అలాగే... VIP 4 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    మహాకూటమి
    మహాకూటమిలో చూస్తే... RJD 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఐఎంఎల్ఎల్ 11, సీపీఎం 3, సీపీఐ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    LJP
    ఎల్జేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    ఇతరులు:
    BSP-1, MIM 2, IND 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

    బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అందుకు విరుద్ధమైన ఫలితాల ట్రెండ్ ఇప్పుడు కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు