• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 FIRST TRENDS NECK TIE BETWEEN NDA AND CONGRESS RJD MAHAGATHBANDHAN NK

Bihar Election Result 2020: బీహార్‌లో NDA-మహాకూటమి మధ్య హోరాహోరీ... తొలి ట్రెండ్స్ ఇవే

Bihar Election Result 2020: బీహార్‌లో NDA-మహాకూటమి మధ్య హోరాహోరీ... తొలి ట్రెండ్స్ ఇవే

బీహార్‌లో NDA-మహాకూటమి మధ్య హోరాహోరీ... తొలి ట్రెండ్స్ ఇవే

Bihar Assembly Election Result 2020: బీహార్‌లో ఎగ్టిట్ పోల్స్ చెప్పినట్లు కాకుండా.... తొలి ట్రెండ్స్ హోరాహోరీగా ఉన్నాయి.

  • Share this:
    Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA, RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరీ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 243 సీట్లు ఉండగా... NDA పార్టీలు బీజేపీ, జేడీయూ కూటమికి... 69 స్థానాల్లో లీడ్ ఉండగా... కాంగ్రెస్, ఆర్జేడీ మహాకూటమి 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 1 స్థానంలో, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. వాస్తవంలో మాత్రం ప్రారంభ ట్రెండ్స్... హోరాహోరీగా ఉన్నాయి.

    Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్‌లో గెలుపు ఎవరిది? నేడే జడ్జిమెంట్ డే

    నిజానికి ఈ ఎన్నికల్లో జేడీయూపై ప్రజా వ్యతిరేకత బాగా ఉందనీ... అందువల్ల ఈసారి జేడీయూకి ఏమాత్రం అనుకూలమైన తీర్పు ప్రజలు ఇవ్వరు అని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. ఐతే... ప్రారంభ ట్రెండ్స్ చూస్తే... అలా లేదని అర్థమవుతోంది. 15 ఏళ్లుగా పాలించిన జేడీయూ ఇప్పటికీ తన సత్తా చాటుకుంటోంది. అలాగే... బీజేపీ కూడా మరోసారి తన మార్క్ చూపిస్తోందని తెలుస్తోంది. అదే సమయంలో... యువనేతగా వచ్చిన తేజస్వీ యాదవ్ కూడా... మహాకూటమిని బలమైన పోటీ ఇచ్చేలా చేయడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: