• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 FIRST TRENDS NECK TIE BETWEEN NDA AND CONGRESS RJD MAHAGATHBANDHAN NK 2

Bihar Election Result 2020: బీహార్‌లో JDU కంటే జోరుగా BJP... ట్రెండ్ సెట్ చేస్తారా?

Bihar Election Result 2020: బీహార్‌లో JDU కంటే జోరుగా BJP... ట్రెండ్ సెట్ చేస్తారా?

బీహార్‌లో JDU కంటే జోరుగా BJP... ట్రెండ్ సెట్ చేస్తారా?

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ప్రధానంగా... అధికార జేడీయూతో జట్టుకట్టిన బీజేపీ... ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం చూపిస్తోంది.

  • Share this:
    Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA ఇప్పటివరకూ ముందంజలో ఉంది. అలాగే... RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి కూడా గట్టి పోటీ ఇస్తూ దాదాపు హోరాహోరీ పిక్చర్ చూపిస్తోంది. ఐతే... పార్టీల వారీగా చూస్తే... మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా... BJP 50, JDU 40, VIP 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే... మహాకూటమిలో చూస్తే... RJD 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం 3, సీపీఐ 1, సీపీఐఎంఎలఎల్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక LJP ప్రభావం పెద్దగా లేదు. 2 స్థానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇతరుల్లో BSP.. 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక, జేడీయూ కూటమికి... 69 స్థానాల్లో లీడ్ ఉండగా... కాంగ్రెస్, ఆర్జేడీ మహాకూటమి 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 1 స్థానంలో, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్‌లో గెలుపు ఎవరిది? నేడే జడ్జిమెంట్ డే

    బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. వాస్తవంలో మాత్రం ప్రారంభ ట్రెండ్స్... హోరాహోరీగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే... కాస్త NDAకే అనుకూలంగా ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: