news18-telugu
Updated: November 10, 2020, 11:36 AM IST
బీహార్‌లో దూసుకెళ్లిన BJP... డౌన్ అయిన JDU...
Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో కొన్ని ప్రత్యేక ఆసక్తికర అంశాలు మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా... బీహార్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోని బీజేపీ... అక్కడ అనూహ్యంగా బలపడినట్లు ట్రెండ్స్‌ని బట్టీ అర్థమవుతోంది. ఎలాగో చూద్దాం. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ... 53 స్థానాలు సాధించింది. ఈసారి ఇప్పటివరకూ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదే సమయంలో... జేడీయూ 2015లో 70 స్థానాలు సాధించగా... ఇప్పుడు మాత్రం జస్ట్ 52 స్థానాల ఆధిక్యానికే పరిమితం అయ్యింది. అంటే... ప్రజలు జేడీయూ కంటే... బీజేపీనే ఎక్కువగా నమ్మారని అనుకోవచ్చు.
నితీశ్ కుమార్‌కి షాక్ తప్పదా?:NDA కూటమి అధికారంలో వచ్చేలా ఉన్నా... సీఎంగా మరోసారి నితీశ్ కుమార్‌కి ఛాన్స్ ఉంటుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే... ఇప్పుడు కూటమిలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ ఉంటుంది. సో, బీజేపీ తమదైన అభ్యర్థిని సీఎంగా ఎంచుకుంటే... అప్పుడు నితీశ్ సైడ్ అవ్వక తప్పదు. పైగా 2015లో జేడీయూ... ఆర్జేడీతో తెగెదెంపులు చేసుకున్నాక... చేతులు కలిపిన బీజేపీ... నితీశ్ కుమార్‌కి చాన్స్ ఇచ్చిందే తప్ప... తమ బీజేపీ అభ్యర్థిని సీఎంగా ఎంపిక చెయ్యలేదు. మరి ఇప్పుడు నితీశ్ సైడ్ అవుతారా... లేక... చివరిసారి తనకో ఛాన్స్ ఇమ్మని కోరతారా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే... ఈసారి ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని నితీశ్ అన్నారు.
Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: బీహార్‌లో మెజారిటీ మార్క్ దాటిన ఎన్డీయే, దుబ్బాకలో బీజేపీ హవా
JDU ఎందుకు డీలా పడింది?
బీహార్ ప్రజలు చాలా తెలివిగా ఓటు వేశారని ఈసారి ట్రెండ్‌ని బట్టీ అర్థమవుతోంది. ప్రధానంగా కరోనా సమయంలో... నితీశ్ కుమార్... వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన బీహార్ వలస ప్రజలకు ఎలాంటి ఉపాధీ చూపించలేకపోయారు. చివరకు వాళ్లు మళ్లీ వేరే రాష్ట్రాలకు ఇప్పుడు వెళ్లిపోతున్నారు. ఇలా తమకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్న నితీశ్‌పై వారు అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దానికి తోడు... 15 ఏళ్లుగా నితీశ్ సీఎంగా ఉంటున్నారు కాబట్టి... ఆటోమేటిక్ గా ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది.
BJP ఎందుకు బలపడింది:బీజేపీ... కేంద్రంలో మరో మూడున్నరేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. అంటే.. బీజేపీని గెలిపిస్తే... కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రజలు నమ్మినట్లు తెలుస్తోంది. పైగా... జేడీయూ... బీజేపీతో కలిసిన తర్వాతే... స్థిరమైన పాలన ఇవ్వగలిగినట్లు ఓటర్లు భావించినట్లు ట్రెండ్స్‌ని బట్టీ అర్థమవుతోంది.
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ప్రస్తుతం NDA కూటమి 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Published by:
Krishna Kumar N
First published:
November 10, 2020, 11:36 AM IST