• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • BIHAR ASSEMBLY ELECTION RESULT 2020 BIHAR RESULTS BIG RELIEF TO BJP IN COVID 19 TIMES NK

Bihar Election Result 2020: కరోనా కష్ట కాలంలో బీహార్‌ ఫలితాలు BJPకి బిగ్ రిలీఫ్

Bihar Election Result 2020: కరోనా కష్ట కాలంలో బీహార్‌ ఫలితాలు BJPకి బిగ్ రిలీఫ్

కరోనా కష్ట కాలంలో బీహార్‌ ఫలితాలు BJPకి బిగ్ రిలీఫ్

Bihar Assembly Election Result 2020: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఆ రాష్ట్రంలో మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా కలిసొస్తున్నాయి. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం.

 • Share this:
  Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఊపిరి పీల్చుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో... ఢిల్లీ అగ్రనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయానికీ... ఢిల్లీలో కమలనాథుల పాలనకూ లింక్ ఉంది. దేశంలో కరోనా వైరస్ రాగానే... బీహార్‌కి చెందిన లక్షల మంది వలస కూలీలు... దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధి కోల్పోయి... నడుస్తూ... ప్రైవేట్ వాహనాల్లో... తిరిగి బీహార్‌కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో... కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఎన్ని చేసినా... వారికి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి మాత్రం కేంద్రం ఇవ్వలేకపోయింది. ఆ మాట కొస్తే... ఆ రాష్ట్రాల్లోని పాలక ప్రభుత్వాలు కూడా ఆ పని చెయ్యలేకపోయాయి. అలా ఎన్నో అసంతృప్తులతో వలస కూలీలు బీహార్ వెళ్లారు.

  కరోనా కాలంలో బీజేపీతోనే:
  కేంద్ర ప్రభుత్వం తమను పూర్తిగా ఆదుకోలేకపోయినా... వలస కూలీలు మాత్రం బీజేపీని బలంగా నమ్మారు. ఫలితంగానే ఆ పార్టీ... బీహార్‌లో 2015లో 53 స్థానాలు సాధించగా... ఈసారి ఏకంగా 70 స్థానాలు గెలుచుకునేలా కనిపిస్తోంది. కరోనా లాక్‌డౌన్ కాలంలో... ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు పడిపోయాయి. దేశం మొత్తం స్తంభించిపోయింది. ఇలాంటి సమయంలో... కేంద్రం మాత్రం ఏం చెయ్యగలదు అని బీహార్ ప్రజలు భావించినట్లు కనిపిస్తోంది. సొంత రాష్ట్రానికి వెళ్లినా... అక్కడా జేడీయూ (బీజేపీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం) సర్కారు తమను ఆదుకోలేదు కాబట్టి... కేంద్రాన్ని విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదని వలస కూలీలు భావించినట్లు ఫలితాలను బట్టీ అర్థమవుతోంది. అసలు తాము ఈ స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం... నితీశ్ కుమారే అని భావించడం వల్లే... ప్రజలు జేడీయూకి దూరమైనట్లు ట్రెండ్స్‌ని బట్టీ అర్థమవుతోంది. ఫలితంగా 2015లో 71 స్థానాలు సాధించిన JDU ఇప్పుడు 21 స్థానాలు కోల్పోయి... 50 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

  Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: బీహార్‌లో మెజారిటీ మార్క్ దాటిన ఎన్డీయే, దుబ్బాకలో బీజేపీ హవా

  BJPకి కలిసొచ్చే కాలం:
  బీహార్ ఫలితాలతో పాటూ... దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా BJP మెరుగైంది. దీని వల్ల మున్ముందు బెంగాల్ సహా వేర్వేరు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి. నిజానికి బీహార్‌లో తాము ఇంత మెరుగైన ఫలితాలు సాధిస్తామని కమలనాథులు అంచనా వెయ్యలేదు. కానీ... ఫలితాలు చూస్తే... ఇప్పుడు బీహార్‌లో అగ్రపార్టీగా బీజేపీయే కనిపిస్తోంది. ఆ పార్టీ ఖాతాలోకి మరో భారీ రాష్ట్రం వచ్చి చేరినట్లైంది. రెండోసారి ప్రధానిగా మరో మూడున్నరేళ్లపాటూ... పాలన సాగించనున్న నరేంద్ర మోదీకి... ఇది చక్కటి శుభవార్తే.

  నిజంగానే ట్రంప్ కంటే మెరుగైన ట్రాక్ రికార్డ్:
  అమెరికాలో కరోనాను ఎదుర్కోవడంలో... అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. ఫలితంగా ఎన్నికల్లో ఓటమి చూడాల్సి వచ్చింది. అదే సమయంలో... ఇండియాలో కరోనాను కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ అన్నీ సమర్థంగా ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ప్రజలు... ప్రభుత్వాలతో కలిసి ముందుకు అడుగులు వేశారు. యావత్ దేశం మొత్తం ఒకే మాటపై నిలబడింది. ఈ క్రమంలో ఎక్కడా... కరోనా వ్యాప్తి విపరీతంగా పెరగకుండా చేయడంలో కేంద్రం సక్సెస్ అయ్యింది. ఇవన్నీ చూస్తున్న ప్రజలు... బీజేపీతోనే సాగేందుకు సిద్ధమైనట్లు ఫలితాల సరళిని బట్టీ అర్థమవుతోంది

  బీహార్ ఫలితాలు:
  బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ప్రస్తుతం NDA కూటమి 127 స్థానాల్లో ఆధిక్యం/గెలుపులో ఉంది. RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి 103 స్థానాల్లో ఆధిక్యం/గెలుపులో ఉంది.
  Published by:Krishna Kumar N
  First published: