Dog park : కుక్కల కోసం దేశంలో అతిపెద్ద పార్క్.. వాకింగ్ ట్రాక్..జిమ్.. లాంటీ ఆధునిక సౌకర్యాలు..!

కుక్కల కోసం దేశంలో అతిపెద్ద పార్క్.. వాకింగ్ ట్రాక్..జిమ్

Dog park : యూపీలోని నోయిడా అథారిటీ కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మిస్తోంది. కుక్కలు వాకింగ్ చేయటానికి..పార్కులో ఊయలతో పాటు ఓ జిమ్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది.

  • Share this:
ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమంతో పాటు మరిన్ని బాధ్యతలు కూడ ఉన్నాయి..మానవుల సంక్షేమంతో పాటు మన చుట్టూ ఉండే జంతువుల సంక్షేమం కూడ ప్రభుత్వాల బాధ్యతగా మారుతోంది..ఈ నేపథ్యంలోనే చాల రాష్ట్ర ప్రభుత్వాలు కుక్కుల కోసం పలు చోట్ల ప్రత్యేక పార్కుల నిర్మాణం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అథారిటీ పెద్ద ఎత్తున పార్కులను నిర్మాణం చేస్తోంది..తమ రాష్ట్ర కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా అత్యధునిక సౌకర్యాలను కల్పించనుంది..ఈ పార్కుల్లో కుక్కలు వాకింగ్ చేయటానికి..అవి ఉయ్యాలు ఊగటానికి ఏర్పాట్లు చేయడంతో పాటు వాటిని ఆరోగ్యంగా ఉంచడం కోసం జిమ్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది.

కాగా యూపి నిర్మించే పార్కు దేశంలోని అతిపెద్ద డాగ్స్ పార్క్ నిర్మాణం గురించి కొంతకాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్రమంలో దీనిపై యూపీలోని నోయిడా అథారిటీ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. కుక్క‌ల పార్కు దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మిస్తున్నామని..చెప్పింది. పార్కును సుమారు రెండు ఎకరాల విస్తిర్ణంలో మొత్తం మూడున్నర కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్టు ప్రకటించింది.

కాగా ఈ పార్కులో వైద్యులతో పాటు ,వాటికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ట్రైనర్స్‌ కూడా అందుబాటులో ఉండాలే ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు..అయితే ఈ పార్క్‌లో వైద్య సదుపాయలకు మాత్రం కుక్కల యాజమానులు మాత్రం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్నా..పూర్తి అయిన తర్వాత మాత్రం దాని నిర్వాహణకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Published by:yveerash yveerash
First published: