Home /News /national /

BIGG BOSS TELUGU 4 SOHEL SHOCKS AFTER SEEING HAND GESTURES OF MEHABOOB SK

Bigg Boss Telugu 4: డబ్బులే ముఖ్యం.. మెహబూబ్ సైగలతో సోహెల్ షాక్.. వీడియో వైరల్

సోహెల్‌కు మెహబూబ్ సైగలు (Twitter)

సోహెల్‌కు మెహబూబ్ సైగలు (Twitter)

Bigg Boss Telugu 4 Grand Finale: సోహెల్‌కు మెహబూబ్ ఇచ్చిన హింట్ ఏంటన్న దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సోహెల్ బిగ్ బాస్ విన్నర్ కావడం లేదని.. రెండో లేదా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుదని మెహబూబ్ హింట్ ఇచ్చినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    Bigg boss telugu 4 grand finale: వంద రోజులకు పైగా అభిమానులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 4 ఆఖరి అంకానికి చేరనుంది. ఇవాళ్టితో ఈ సీజన్‌ ముగియనుంది. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఐదుగురి సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తాడన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఐతే ఫైనల్‌కు ముందు బిగ్ బాస్ ఇంట్లో రీయూనియన్ ఏర్పాటు చేశారు. అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ మినహా ఈ సీజన్ కంటెస్టెంట్లు అందరూ మళ్లీ ఇంట్లోకి వెళ్లి.. తమ మిత్రులను అలరించారు. రీయూనియన్ కోసం ఇంట్లోకి వెళ్లిన మెహబూబ్.. తన ఫ్రెండ్‌ సోహెల్‌కు సైగలు చేసి ఏదో హింట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    రీయూనియన్ సమయంలో ఇంట్లోకి వెళ్లే సభ్యులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్నో కండిషన్లు పెడతారు. బయట టాక్ ఎలా ఉంది? ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరు గెలిచే అవకాశముంది? అనే అంశాల గురించి మాట్లాడకూడదు. అందుకే అందరూ ఇంట్లోకి వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాకుండా కేవలం ఎంటర్‌టైన్ చేశారు. అందరూ రిలాక్స్‌గా ఉండాలని.. చివరి రోజును ఎంజాయ్ చేయాలని సూచించారు. కానీ మెహబూబ్ మాత్రం సోహెల్ వద్దకు వెళ్లి ఏదో సైగలు చేశాడు. చేతి వేళ్లతో హింట్ ఇచ్చాడు. మెహబూబ్ సైగలు సోహెల్ కూడా అర్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత తలకు చేతులు పెట్టుకొని వెనక్కి వెళ్లిపోయాడు సోహెల్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఐతే సోహెల్‌కు మెహబూబ్ ఇచ్చిన హింట్ ఏంటన్న దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సోహెల్ బిగ్ బాస్ విన్నర్ కావడం లేదని.. రెండో లేదా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుదని మెహబూబ్ హింట్ ఇచ్చినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. విన్నర్ ప్రకటనకు ముందు నాగార్జున ఒకవేళ డీల్ ఆఫర్ చేస్తే.. దానికి ఒప్పుకొని, డబ్బులు తీసుకొని బయట పడాలని సూచించినట్లు చెబుతున్నారు. డబ్బులు తీసుకోవాలని తన చేతి వేళ్లతో మెహబూబ్ క్లియర్‌గా సైగలు చేశాడని ట్వీట్స్ పెడుతున్నారు.


    కాగా, ప్రస్తుతం అభిజీత్, అఖిల్, సోహెల్, అరియానా, హారిక టాప్-5లో ఉన్నారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అనధికారిక పోలింగ్ ప్రకారం.. అభిజీత్ టైటిల్ గెలిచినట్లు తెలిసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అఖిల్, సోహెల్, అరియానా, హారిక ఉన్నట్లు సమాచారం. మరి ప్రేక్షకులు ఎవరిని బిగ్‌బాస్ విన్నర్ చేశారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Nagarjuna Akkineni, Tollywood

    తదుపరి వార్తలు