Home /News /national /

BIG SHOCK TO INDIA MEHUL CHOKSI GRANTED INTERIM BAIL MEDICAL GROUNDS DOMINICA COURT NGS

PNB Scam: మెహుల్‌ చోక్సీకి బెయిల్.. భారత్ కు రప్పించే ప్రయత్నాలకు విఘాతం..

మెహుల్ చోక్సీ(ఫైల్ ఫొటో)

మెహుల్ చోక్సీ(ఫైల్ ఫొటో)

చోక్సీని ఇక భారత్ కు రప్పించడం సాధ్యం కాదా..? దొరికినట్టే దొరికి తప్పించుకున్నారా..? కొత్తగా కిడ్నాప్ డ్రామాను అందుకే తెరపైకి తెచ్చారా..? కారణం ఏదైనా ఆయనకు బెయిల్ రావడంతో.. భారత్ ప్రయత్నాలకు విఘాతం కలిగినట్టే..

    భారత దేశం నుంచి పారిపోయి.. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్‌ చోక్సీకి డొమెనికా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సుమారు 2.75 లక్షల రూపాయల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా బార్బుడాకు చోక్సీ వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. దీంతో చోక్సీని ఇండియాకు తీసుకురావాలన్న యత్నాలకు విఘాతం కలిగినట్లయింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన చోక్సీ 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఇటీవలే ఆయన్ను కొందరు అపహరించి డొమెనికాకు తీసుకుపోవడం కలకలం సృష్టించింది. చోక్సీ అక్రమ చొరబాటుపై మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు జరిగే విచారణపై కూడా స్టే మంజూరు చేసింది. చికిత్స అనంతరం చోక్సీ విచారణకు హాజరుకావాల్సిందేనని, ఈ విషయంలో బెయిల్‌ కుదరదని కోర్టు స్సష్టటం చేసింది.

    అయితే ఆయనకు అక్కడ బెయిల్ రావడంతో.. ఎలాగైనా భారత్ కు రప్పించాలని ఇక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడింది. ఇప్పట్లో చోక్సీని భారత్ కు రప్పించడం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది. భారత్ కు రావడం ఇష్టం లేకనే ఇలా అనారోగ్య కారణాలు చూపుతున్నారని అనుమానిస్తున్నారు. అయినా భారత ప్రభుత్వం మాత్రం ఎలాగైనా చోక్సీని రప్పిస్తామంటోంది.

    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో ప్ర‌ధాన‌ నిందితుడిగా ఉన్న‌ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ డొమినికా రిపబ్లిక్ దేశంలో పట్టుబట్టారు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకును బురిడీ కొట్టించి దేశం వదిలి వెళ్లిపోయారు.
    అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు. గత ఏడాది లండన్‌లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. నీరవ్ మోడీతో పాటు పీఎన్బీ స్కాంలో సహ నిందితుడిగా ఉన్న మోహుల్ చోక్సీ...అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్​ వేశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్​ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు పీఎన్‌బీ స్కామ్‌ ప్రధాన నిందితుడు మెహుల్‌ చోక్సిని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్‌ కొట్టి పారేశారు. ఆ దేశంలో ప్రసారమయ్యే ఒక వీక్లీ షోలో పాల్గొన్న రూజ్‌వెల్ట్, ఇవన్నీ అర్ధం లేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. కోర్టు తన పని తాను చేస్తుందని, అలాగే తమ రాజ్యాంగం ప్రకారం చోక్సి ఉన్న హక్కులకు రక్షణ లభిస్తుంది అన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: International news, Mehul Choksi, National, PNB Scam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు