సినీ ఇండస్ట్రీకి కేంద్రం భారీ షాక్... ధియేటర్లకు నో పర్మిషన్...

సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, ధియేటర్లు (ఓపెన్ ఎయిర్ ధియేటర్లు మినహా), మూసి ఉంటాయి.

లాక్‌డౌన్ 5లో భాగంగా సినిమా ధియేటర్ల మూసి ఉంచాలని కేంద్రం నిర్ణయించడం సినీ రంగానికి షాక్ ఇచ్చింది.

  • Share this:
    లాక్‌డౌన్ 5‌లో భాగంగా అనేక సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... సినీ ఇండస్ట్రీకి మాత్రం భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం ధియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తే... లాక్‌డౌన్ రూల్స్ పాటిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధం కావాలని ఎగ్జిబిటర్లు భావించారు. కానీ కేంద్రం మాత్రం ధియేటర్లను అనుమతించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్ సర్వీసులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు వంటి వాటికి నో పర్మిషన్ అనేసిన కేంద్రం... ఈ జాబితాలో సినిమా ధియేటర్లను కూడా చేర్చడం సినీ రంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

    పరిస్థితిని బట్టి వీటికి ఎప్పుడు అనుమతి ఇస్తామనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం... జూన్ 30 వరకు కొనసాగే లాక్‌డౌన్ 5 నాటికి ధియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తుందా అన్నది సందేహంగానే మారింది. మరోవైపు సినిమా, సీరియల్ షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చే విషయంలోనూ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు కనిపిస్తోంది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో వీటి ప్రస్తావన లేకపోవడంతో... షూటింగ్స్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి లాక్ డౌన్ 5 ద్వారా అనేక రంగాలకు భారీ సడలింపులు ఇచ్చిన కేంద్రం... సినీ రంగానికి మాత్రం ఊహించని షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: