హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid Big News: కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గింపు.. ఆ రెండు టీకాలు ఇప్పుడు రూ.225కే.. వివరాలివే..

Covid Big News: కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గింపు.. ఆ రెండు టీకాలు ఇప్పుడు రూ.225కే.. వివరాలివే..

కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరల తగగ్గింపు.

కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరల తగగ్గింపు.

ఇండియావ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి బూస్టర్ డోసుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా రెండు ప్రధాన తయారీదారులు టీకాల ధరలను భారీగా తగ్గించాయి. పూర్తి వివరాలివే..

దేశంలో కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి  సంచలన ప్రకటన వెలువడింది. ఇండియావ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి బూస్టర్ డోసుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా రెండు ప్రధాన తయారీదారులు టీకాల ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆస్పత్రులకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర (ఒక డోసుకు) రూ.600 నుంచి రూ.225 అయింది. అలాగే, కొవాగ్జిన్ ధర(ఒక డోసు) రూ.1200 నుంచి రూ.225కు తగ్గింది. ఈ మేరకు సీరం ఇనిస్టిట్యూట్ ఈసీవో అధర్ పూనావాలా, భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్రా ఎల్లా శనివారం ఒకే సమయంలో వేర్వేరుగా ప్రకటనలు చేశారు.

కొవిడ్ కొత్త రకం వేరియంట్లు మళ్లీ పుట్టుకొస్తున్న క్రమంలో దేశంలో బూస్టర్ డోసుల పంపిణీకి రంగం సిద్దమైంది. ఆదివారం(ఏప్రిల్ 10) నుంచే ఈ ప్రక్రియ ఆరంభం కానుంది. అయితే, గతానికి భిన్నంగా బూస్టర్ డోసుల పంపిణీని కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోని టీకా కేంద్రాల్లో మాత్రమే అందించనున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించే టీకా కేంద్రాల్లో బూస్టర్ డోసుల పంపిణీపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఆదివారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ పంపిణీ చేపట్టనుండగా, వ్యాక్సిన్ల ధరలు తగ్గిస్తూ కంపెనీలు శనివారం నాడే సంచలన ప్రకటన విడుదల చేశాయి.

Uber | Ola : ఏసీకి అదనపు చార్జీ.. క్యాబ్ డ్రైవర్లకు ఉబెర్ షాక్.. త్వరలో రేట్ల పెంపు బాదుడు!

కొవాగ్జిన్ టీకా ధర రూ.1200 కాగా, దానిపై రూ.975 తగ్గించి రూ.225కే అందుబాటులోకి తెచ్చారు. అదే సీరం వారి కొవిషీల్డ్‌ ధర రూ.600 కాగా, దానిపై రూ.375 తగ్గించి రూ.225 కే అందించనున్నారు.

‘18 ఏళ్లు పైబడిన అందరికీ బూస్టర్ డోసులను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న టీకాల ధరను ఒక్కో డోసుకు రూ.1200 నుంచి రూ.225కు తగ్గిస్తున్నాం..’అని భారత్ బయోటెక్ సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు. ‘ప్రైవేటు ఆస్పత్రులకు అందించే కొవిషీల్డ్ టీకా ధరలను తగ్గించామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కొవిషీల్డ్ డోసు రూ.600 నుంచి రూ.225కు సవరించాం..’అని సీరం అధర్ పూనావాలా ట్వీట్ చేశారు.

Jogipet జాతిరత్నాలు: తాగిన మైకంలో అబ్బాయికి తాళి కట్టాడు.. వాడేమో కాపురం చేస్తానని ఇంటికొచ్చాడు!

దేశంలో బూస్టర్ డోసుల పంపిణీపై కేంద్ర వైద్యారోగ్యశాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. 18 ఏళ్లు నిండినవారు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తైన వారందరూ ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోస్ తీసుకోవచ్చని కేంద్రం సూచించింది. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం బూస్టర్ డోసును ఉచితంగా ఇస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 96శాతం మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 86 శాతం మంది రెండో డోసు తీసుకున్నారు.

First published:

Tags: Covaxin, Covid, Covid vaccine, Covishield

ఉత్తమ కథలు