Home /News /national /

BIG DECESSION OF MAULVIS OF 26 MOSQUES IN MUMBAI MORNING AZAAN WITHOUT LOUDSPEAKER PVN

Loud Speakers : రాజ్ థాకరే వార్నింగ్..కీలక నిర్ణయం తీసుకున్న ముస్లిం మత పెద్దలు

రాజ్ థాకరే(ఫైల్ ఫొటో)

రాజ్ థాకరే(ఫైల్ ఫొటో)

Loud Speakers Issue : మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న డిమాండ్ పై ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. భారీ సౌండ్లు వ‌చ్చే లౌడ్‌ స్పీక‌ర్ల‌ను మ‌సీదుల నుంచి తీసి వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. మ‌సీదుల వ‌ద్ద అక్ర‌మ లౌడ్‌స్పీక‌ర్ల‌ను తొల‌గించ‌నంత వ‌ర‌కు హ‌నుమాన్ ఛాలీసా వ‌ల్లిస్తూనే ఉంటామ‌ని రాజ్ థాక‌రే వార్నింగ్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
Loud Speakers Issue : మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న డిమాండ్ పై ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. భారీ సౌండ్లు వ‌చ్చే లౌడ్‌ స్పీక‌ర్ల‌ను మ‌సీదుల నుంచి తీసి వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. మ‌సీదుల వ‌ద్ద అక్ర‌మ లౌడ్‌స్పీక‌ర్ల‌ను తొల‌గించ‌నంత వ‌ర‌కు హ‌నుమాన్ ఛాలీసా వ‌ల్లిస్తూనే ఉంటామ‌ని రాజ్ థాక‌రే వార్నింగ్ ఇచ్చారు. ఆ లౌడ్‌స్పీక‌ర్ల‌ను తొల‌గించ‌నంత వ‌ర‌కు త‌మ ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంటుంని థాక‌రే అన్నారు. రాష్ట్రంలో శాంతి కావాల‌ని, 135 మ‌సీదులు సుప్రీం ఆదేశాల‌ను ఉల్లంఘించాయ‌ని, వాటిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని పోలీసులని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేవ‌లం ఎంఎన్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పైనే చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌సీదులే కాదు చాలా వ‌ర‌కు ఆల‌యాల్లో భారీ లౌడ్‌స్పీక‌ర్లు ఉన్నాయ‌న్నారు. లౌడ్‌స్పీక‌ర్ల అంశం మ‌త‌ప‌ర‌మైంది కాదు అని, అదో సామాజిక స‌మ‌స్య అని రాజ్ థాక‌రే తెలిపారు. ఈ క్రమంలో మసీదుల్లో ఉదయం వేళల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ ఇవ్వకూడదని దక్షిణ ముంబైలోని మత పెద్దలు, ధర్మకర్తలు నిర్ణయించారు. ముంబైలోని మహమ్మద్‌ అలీ రోడ్‌, మదన్‌పురా, నాగ్‌పడా, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలు సహా 26 మసీదుల మత పెద్దలు సున్నీ బడి మసీదు సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లోని మసీదుల్లో ఇప్పుడు ఉదయం అజాన్‌ ను లౌడ్‌స్పీకర్‌లో చదవరు.. అలాగే సుప్రీం కోర్టు తీర్పును అన్ని మసీదుల్లో కచ్చితంగా పాటిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అజాన్‌ ఉండదు, లౌడ్‌స్పీకర్‌ను ఉపయోగించరు.

మరోవైపు లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై రాజ్ థాకరే మహారాష్ట్ర మొత్తం రాజకీయ తుపాను సృష్టించారు. అందుకే ఇప్పుడు రాజ్ థాకరేకి సన్నిహితంగా ఉండే నేతలకు ఉచ్చు బిగుసుకోవడం మొదలైంది...ఇప్పుడు ముంబైలో లౌడ్ స్పీకర్ లో హనుమాన్ చాలీసా వల్లించిన మహేంద్ర భానుశాలిని అరెస్ట్ చేసిన పోలీసులు.. MNS నేత భానుశాలిని మే 17 వరకు రిమాండ్ కు తరలించారు. మసీదు ముందు హనుమాన్ చాలీసాను మొదట లౌడ్ స్పీకర్‌లో వాయించిన నాయకుడు భానుశాలి ఒక్కరే. భానుశాలితో పాటు మహారాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో 50 మందికి పైగా అరెస్టు చేశారు. లౌడ్ స్పీకర్ వివాదంలో ఇప్పుడు ముంబై పోలీసులు ఎంఎన్ఎస్ కు చెందిన పలువురు పెద్ద నాయకుల కోసం వెతుకుతున్నారు.

ALSO READ ఇండియా అంటే ఇదేరా.. మసీదు కోసం కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన హిందూ అక్కాచెల్లెళ్లు

ముంబై నగరంలో ఉన్న 2,400 దేవాలయాల్లో కేవలం 24 ఆలయాలకు మాత్రమే లౌడ్ స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి ఉంది. మొత్తం 1140 మసీదులలో 950 లౌడ్ స్పీకర్లను ఉపయోగించడానికి అధికారిక అనుమతి పొందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..,నగరంలోని 1 శాతం దేవాలయాలు మాత్రమే తమ ప్రాంగణంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడానికి అనుమతి తీసుకున్నాయి. చర్చిలు, గురుద్వారాలు, బౌద్ధ ఆరామాలు మరియు యూదుల ప్రార్థనా స్థలాలు వంటి ఇతర మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పోలీసులు ఇప్పటికీ డేటాను సేకరిస్తున్నారు. ఈ ప్రార్థనా స్థలాలన్నింటి వద్ద లౌడ్ స్పీకర్ల అనుమతి తీసుకోవాలని పోలీసులు కోరారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Maharashtra, Raj Thackeray

తదుపరి వార్తలు