రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ మరోసారి తన మార్క్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అది కూడా మొదటి 100 రోజుల్లోనే భారీ ఆర్థిక సంస్కరణలు చేపట్టబోతున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం మోదీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని నీతీ ఆయోగ్ ఉన్నతాధికారులు చెబుతున్న మాట. సరికొత్త పారిశ్రామికాభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్స్ సృష్టించడం, కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రైవేటీకరణ చర్యలు ఈ సంస్కరణల్లో భాగమని నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. కొన్ని భారీ సంస్కరణల్ని మీరు చూడబోతున్నారని, విదేశీ పెట్టుబడిదారులు సంతోషించే విషయాలు ఉంటాయని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కుమార్ చెప్పారు.
విధాన నిర్ణయాలకు, సరికొత్త ఆలోచనల సృష్టికి నీతి ఆయోగ్ కేంద్ర బిందువు. నాలుగేళ్ల క్రితం 65 ఏళ్లనాటి ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మన్‌గా ప్రధాన మంత్రి ఉంటారు. ఆయన తర్వాత వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఉంటారు. ఇప్పుడు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ నేరుగా ఈ విషయాలను వెల్లడించారంటే 100 రోజుల్లో మోదీ మార్క్ సంచలన నిర్ణయాలు చూడబోతున్నామని అర్థం చేసుకోవచ్చు. జూలైలో పార్లమెంట్ సమావేశాల్లో సంక్లిష్టంగా ఉన్న కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలకు తొలి అడుగులు పడతాయని రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెడతారని అన్నారు.
వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత-సంక్షేమం, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం లాంటి 44 చట్టాలను ఏకం చేయడమే ఈ బిల్లు లక్ష్యం. ఉద్యోగులు, అధికారులతో కంపెనీలకు వచ్చే వివాదాలను తొలగించేందుకు కొత్త బిల్లు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉపయోగం లేకుండా ఉన్న భూములను గుర్తించి వాటిని విదేశీ ఇన్వెస్టర్లకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉన్న 42 ప్రభుత్వ రంగ సంస్థల్ని కొన్ని నెలల్లో పూర్తిగా మూసెయ్యడం లేదా ప్రైవేటీకరించడం ఖాయమని అన్నారాయన. అందులో ఎయిర్ ఇండియా ఒకటి.
నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి
ఇవి కూడా చదవండి:
ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి
Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా
ఆన్లైన్లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Narendra modi, NDA, Niti Aayog, Pm modi