• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BIG ACCIDENT IN BIHAR 9 KILLED AS PICK UP VAN FALLS INTO GANGA RIVER IN PATNA SK

Patna Accident: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 9 మంది దుర్మరణం

Patna Accident: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 9 మంది దుర్మరణం

ప్రతీకాత్మక చిత్రం

వ్యాన్‌లో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 13 మంది ఉన్నారు. ఐతే పీపాపుల్ బ్రిడ్జిపైకి చేరుకోనే వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అనంతరం ఆ వ్యాన్ నేరుగా నదిలోకి దూసుకెళ్లింది.

  • Share this:
    బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగిది. అతివేగంతో అదుపు తప్పిన ఓ పికప్ వ్యాన్ గంగా నదిలోకి దూసుకెళ్లింది. బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. పాట్నాలోని అఖీపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 07.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దనాపూర్లోని చిత్రకూట్‌నగర్‌కు చెందిన ఓ ఫ్యామిలీ అఖీపూర్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయింది. వేడుకల అనంతరం తిరిగి సొంతూరి పయనమయ్యారు. వ్యాన్‌లో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 13 మంది ఉన్నారు. ఐతే పీపాపుల్ బ్రిడ్జిపైకి చేరుకోనే వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అనంతరం ఆ వ్యాన్ నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందాలు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలోకి దిగి గాలించగా 9 మృతదేహాలను బయటపడ్డాయి. మరో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

    మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులను రమాకాంత్ రాయ్, అర్వింద్ కుమార్, అశిష్ కుమార్, గీతా దేవి, సరోజ్ దేవి, అనురాధా దేవిగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న ఎంపీ, మాజీ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ప్రమాదంపై సీఎం నితీష్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేల్ చంద్రశేఖర్ సింగ్ ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: