Bhupendra Patel swearing in : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టిన భూపేంద్ర భాయ్ పటేల్.. ఇవాళ మరోసారి (రెండోసారి) సీఎం (Gujarat New CM)గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజధాని గాంధీనగర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. అలాగే.. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతోపాటూ.. దాదాపు 20 మంది గత కేబినెట్ మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. హెలిప్యాడ్ గ్రౌండ్‌లోని కొత్త సెక్రటేరియట్ భవనంలో.. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర ప్రమాణం చేయబోతున్నారు. ఆయనతోపాటూ.. కొందరు గత ప్రభుత్వ (మాజీ) మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
భూపేంద్ర పటేల్.. అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి రెండోసారి గెలిచారు. తన ప్రధాన ప్రత్యర్థిపై 1.92 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటివరకూ ఉన్న విజయ్ రూపానీని తొలగించి భూపేంద్రను బీజేపీ హైకమాండ్.. సీఎంగా కూర్చోబెట్టింది. ఆ నిర్ణయం సరైనదేనని భూపేంద్ర నిరూపించారు.
కీలక పాయింట్లు:
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు.. బీజేపీ 156 స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress Party) 17 స్థానాలకే పరిమితం అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఐదు స్థానాలు గెలుచుకుంది. ఐతే.. ఆప్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ డ్రామా కొనసాగుతోంది.
ఇవాళ ప్రమాణం జరిగే భవనం.. తాత్కాలిక భవనం. ఇందులో 20 వేల మంది పట్టే వీలు ఉంది. దీని పర్యవేక్షణను ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చూసుకుంటోంది.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటూ.. ఆఫీస్ బీరర్స్, రకరకాల మోర్చాల ఆఫీస్ బీరర్స్, APMCల ఛైర్మన్లు, ఉప ఛైర్మన్లు, డైరెక్టర్లు కూడా ప్రమాణ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇంకా.. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, జనసంఘ్ పెద్దలు కూడా వస్తారని తెలిసింది.
ఎన్నికల ఫలితాల తర్వాత 60 ఏళ్ల భూపేంద్ర పటేల్.. శుక్రవారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. ఆయన సారధ్యంలోనే పాలనను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యింది. ఐతే.. కొత్త మంత్రివర్గంలో మాత్రం కొందరు కొత్త వారు ఉంటారని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bhupendrabhai Patel, Gujarat, Narendra modi