హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bheemla Nayak closing WW collections: ‘భీమ్లా నాయక్’ క్లోజింగ్ కలెక్షన్స్.. చివరికి మళ్లీ నష్టాలే మిగిలాయి..!

Bheemla Nayak closing WW collections: ‘భీమ్లా నాయక్’ క్లోజింగ్ కలెక్షన్స్.. చివరికి మళ్లీ నష్టాలే మిగిలాయి..!

Bheemla Nayak closing WW collections: మరికొన్ని గంటల్లోనే భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా ఓటిటిలో విడుదల కానుంది. మార్చ్ 24న ఆహా, హాట్ స్టార్ డిస్నీలో రానుంది ఈ చిత్రం. దాంతో ఈ సినిమా థియెట్రికల్ రన్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన ఈ సినిమాకు కొన్నిచోట్ల నష్టాలు తప్పలేదు.

ఇంకా చదవండి ...

    మరికొన్ని గంటల్లోనే భీమ్లా నాయక్ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. మార్చ్ 24న ఆహా, హాట్ స్టార్ డిస్నీలో రానుంది ఈ చిత్రం. దాంతో ఈ సినిమా థియెట్రికల్ రన్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా (Rana Daggubati) హీరోలుగా నటించిన ఈ సినిమాకు కొన్నిచోట్ల నష్టాలు తప్పలేదు. మొదట్లో అదిరిపోయే వసూళ్లు వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ కనిపించింది. రెండో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకున్న బయ్యర్లకు పెద్దగా కలలు నెరవేరలేదు. మూడో వారం సినిమా ఉన్నట్లు కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. తొలి మూడు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చిన భీమ్లా.. నాలుగో రోజు నుంచి తగ్గిపోయాడు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా పడిపోయాయి వసూళ్లు. సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా 9 కోట్ల దూరంలో ఉంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా నాయక్‌ క్లోజింగ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..

    నైజాం: 35.00 కోట్లు

    సీడెడ్: 11.20 కోట్లు

    ఉత్తరాంధ్ర: 7.66 కోట్లు

    ఈస్ట్: 5.54 కోట్లు

    వెస్ట్: 5.13 కోట్లు

    గుంటూరు: 5.30 కోట్లు

    కృష్ణా: 4.25 కోట్లు

    నెల్లూరు: 2.83 కోట్లు

    ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్: 76.91 కోట్లు

    రెస్టాఫ్ ఇండియా  + కర్ణాటక: 8.28 కోట్లు

    ఓవర్సీస్: 12.65 కోట్లు

    వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 98.20 కోట్లు (161 కోట్లు గ్రాస్)

    భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా మాత్రం 98.20 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. అంటే దాదాపు 9 కోట్లు నస్టాలు వచ్చాయన్నమాట. గతేడాది వకీల్ సాబ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాకు 87 కోట్ల వరకు షేర్ వచ్చినా కూడా.. బిజినెస్ ఎక్కువ జరగడంతో కొన్ని చోట్ల నష్టాలు తప్పలేదు. ఏపీలో ప్రతికూల పరిస్థితులు భీమ్లాను దెబ్బ తీసాయి.

    First published:

    ఉత్తమ కథలు