ప్రణబ్ ముఖర్జీకి 'భారతరత్న'..నానాజీ, హజారికాకు కూడా...

ఒకేసారి కాంగ్రెస్ కురువృద్ధుడు, కమ్యూనిస్ట్ కవి, ఆర్ఎస్ఎస్ నేతకు భారతరత్న ప్రకటించింది కేంద్రం.

news18-telugu
Updated: January 26, 2019, 6:39 AM IST
ప్రణబ్ ముఖర్జీకి 'భారతరత్న'..నానాజీ, హజారికాకు కూడా...
ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్‌ముఖ్, భూపెన్ హజారికా
  • Share this:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ఆయనతో పాటు మాజీ జన సంఘ్ నేత నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికా కూడా భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రస్తుతం నానాజీ దేశ్‌ముఖ్, హజారికా జీవించి లేరు. మరణానంతరం వారిద్దరికి భారత రత్న పురస్కారం దక్కింది.  ఒకేసారి కాంగ్రెస్ కురువృద్ధుడు, కమ్యూనిస్ట్ కవి, ఆర్ఎస్ఎస్ నేతకు భారతరత్న ప్రకటించింది కేంద్రం.

ప్రణబ్ ముఖర్జీ:  భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పనిచేశారు. 25 జూలై 2012 – 25 జూలై 2017 వరకు ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. అంతకుముందు 24 జనవరి 2009 నుంచి 2012 జూలై 24 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. యూపీఏ 1 హయాంలో ఆయన దేశ రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2004 మే 22 నుంచి 2006 అక్టోబర్ 27 వరకు ఆయన రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. 2006 అక్టోబర్ 24 నుంచి 2009 మే 22 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1995 ఫిబ్రవరి 10 నుంచి 1996 మే 16 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు.

1935 డిసెంబర్ 11న బ్రిటిష్ ఇండియాలోని పశ్చిమ బెంగాల్లో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. 1969లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన భార్య 2015లో చనిపోయారు. ప్రణబ్ ముఖర్జీకి ముగ్గురు పిల్లలు. శర్మిష్ట ముఖర్జీ, అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ ముఖర్జీ.

నానాజీ దేశ్‌ముఖ్: మాజీ జన సంఘ్ నేత. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. నానాజీ దేశ్ ముఖ్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు చండీదాస్ అమృతారావ్ దేశ్‌ముఖ్. 11 అక్టోబర్ 1916న జన్మించారు. 27 ఫిబ్రవరి 2010న తుదిశ్వాస విడిచారు. ఆయన విద్య, వైద్యం, గ్రామీణ వికాసం వంటి రంగాలు విశేష సేవలు అందించారు. గతంలో ఓసారి లోక్‌సభ సభ్యుడిగా, మరోసారి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. గతంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారం దక్కింది.

మహారాష్ట్రలో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబలో పుట్టిన నానాజీ దేశ్‌ముఖ్ కి లోకమాన్య తిలక్ స్ఫూర్తి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్‌తో కలసిన తర్వాత ఆర్ఎస్ఎస్‌ వైపు ఆకర్షితులయ్యారు. 1940లో హెగ్డేవార్ చనిపోయిన తర్వాత చాలా మంది యువత ఆర్ఎస్ఎస్‌లో క్రియాశీలకంగా మారారు. వారిలో నానాజీ దేశ్‌ముఖ్ ఒకరు. అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎం.ఎస్ గోల్వాల్కర్ సూచనతో యూపీకి వెళ్లి అక్కడ ఆర్ఎస్ఎస్‌ను బలోపేతం చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పత్రికలకు కూడా పనిచేశారు.

భూపేన్ హజారికా: అస్సామీ వాగ్గేయకారుడు. గతంలో పద్మభూషణ్, దాదా సాహెబ్ పాల్కే అవార్డులు అందుకున్నారు. మానవతా వాదిగా హజారికా రచించిన పాటలు అన్ని భారతీయ భాషల్లోకీ అనువాదమయ్యాయి. 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాంలోని సాదియాలో జన్మించిన భూపేన్ హజారికా హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు పని చేశారు. సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాకు భారతరత్న పురస్కారం దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారతజాతికి వారు చేసిన సేవను కొనియాడుతూ ట్వీట్ చేశారు. 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ సంపూర్ణ అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాం గాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు చేశారని సీఎం కొనియాడారు.
First published: January 25, 2019, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading