హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid 19 Vaccine: భారత్ బయోటెక్ సంచలన ప్రకటన.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే..

Covid 19 Vaccine: భారత్ బయోటెక్ సంచలన ప్రకటన.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వారిలో స్వల్పంగా జ్వరం, ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి సాధారణమేనని వైద్యాధికారులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వైద్యాధికారులు అధికారికంగా చెప్పిన ఈ లక్షణాలే కాకుండా కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వారిలో వంధత్వం వస్తుందనీ, భవిష్యత్ లో వారు పిల్లలను కనలేరంటూ..

ఇంకా చదవండి ...

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటి విడతగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు దగ్గరుండి మరీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో సీఎం జగన్ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా, తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సిన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. మొత్తానికి ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేసిన కరోనాకు విరుగుడు వచ్చేసిందని దేశ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. కరోనాను జయించేశామన్న ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా టీకాను తీసుకున్న వారిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆసక్తికర చర్చ జరగుతోంది.

కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వారిలో స్వల్పంగా జ్వరం, ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి సాధారణమేనని వైద్యాధికారులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వైద్యాధికారులు అధికారికంగా చెప్పిన ఈ లక్షణాలే కాకుండా కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్న వారిలో వంధత్వం వస్తుందనీ, భవిష్యత్ లో వారు పిల్లలను కనలేరంటూ ఫేక్ వార్తలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అలాంటి వార్తలను ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రే ఖండించడం గమనార్హం. అయితే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వస్తున్న వార్తలపై భారత్ బయోటెక్ స్పందించింది.

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ను కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతగా దాదాపు 55 లక్షల మేర డోసులను భారత్ బయోటెక్ సరఫరా చేసింది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ పై భారత్ బయోటెక్ స్పందించింది. ‘కొవిడ్ వ్యాక్సిన్లను వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొందరు భయపడుతున్నారు. మేం అందించిన కోవాగ్జిన్ ను వేసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పూర్తి నష్టాన్ని మేమే భరిస్తాం. టీకాను వేసుకోవడం వల్లే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని నిరూపణ జరిగితే మేమే అందుకు భాద్యద వహిస్తాం. కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నంత మాత్రాన ఇతర జాగ్రత్తలు తీసుకోనవసరం లేదనుకోవడం పొరపాటు. ఎప్పటిలాగానే మాస్కు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి‘ అని భారత్ బయోటెక్ కీలక అధికారి ఒకరు తేల్చిచెప్పారు.

First published:

Tags: Corona Possitive, Corona virus, Covaxin, COVID-19 vaccine, Narendra modi

ఉత్తమ కథలు