BHARAT BIOTECH COVAXIN VACCINE GETS APPROVAL FOR NEXT PHASE OF TRIALS ON 2 TO 18 YEAR OLD CHILDREN GH SK
Covaxin: 18 ఏళ్లలోపు పిల్లలకూ టీకా.. కొవాగ్జిన్‌పై క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి
ప్రతీకాత్మక చిత్రం
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సంకల్పించింది. ఈక్రమంలోనే పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది.
కరోనా కట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే తొలి రెండు దశల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్, 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందజేశారు. మే 1న ప్రారంభమైన మూడో దశలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అయితే, కరోనా సెకండ్‌వేవ్ వృద్ధులు, యువకులపైనే కాకుండా చిన్నపిల్లలపై కూడా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై వ్యాక్సిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కాగా, ఇప్పుడు రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్ కోసం భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా అనుమతి పొందింది.
పిల్లలకు వాక్సిన్ ఇస్తే వస్తే సైడ్ ఎఫెక్ట్స్, ఇమ్యునోజెనిసిటీని, సేఫ్టీని అంచనా వేయడానికి II / III క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా భారత్ బయోటెక్ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో)ని కోరగా.. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసి) దీనికి అనుమతిన్చింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా 2 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? అనే విషయం తేలనుంది.
పిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్?
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సంకల్పించింది. వైరస్ ఫస్ట్ వేవ్ వృద్ధులపై దాడి చేసింది. ఇక సెకండ్ వేవ్ ఎక్కువగా యువతపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ పిల్లలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందిని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ బయోటెక్ నిర్వహించనున్న ఈ క్లినికల్ ట్రయల్స్‌లో ఎయిమ్స్, ఢిల్లీ, ఎయిమ్స్, పాట్నా, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నాగ్‌పూర్‌లు కూడా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మొత్తం 525 సబ్జెక్ట్లపై ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్ స్వదేశీగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారికి అందించబడుతోంది. ఇదిలా ఉంటే, 12 ఏళ్ల పైబడిన పిల్లలకు కోవాగ్జిన్ ఆమోదం పొందిందని ఈ మధ్య కాలంలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై పిఐబి ఫ్యాక్ట్‌చెక్ స్పష్టతనిచ్చింది. ‘‘భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా 12 నుండి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఆమోదం పొందిందని ఫేక్ న్యూస్ ప్రచారం అవుతోంది. ఇది నిజం కాదు. భారత ప్రభుత్వం దీనికి అనుమతివ్వలేదు.” అని పిఐబి ఫాక్ట్ చెక్ పేర్కొంది. ప్రస్తుతం, 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే టీకా వేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.